మలయాళీ భామలే కావాలంటున్న హీరో

  • IndiaGlitz, [Saturday,December 10 2016]

విల‌క్ష‌ణ న‌టుడుగా పేరున్న వారిలో చియాన్ విక్ర‌మ్ ఒక‌డు. అందుకే తెలుగు, త‌మిళంలో విక్ర‌మ్ సినిమాల‌కు మంచి క్రేజ్ ఉంటుంది. రీసెంట్‌గా విక్ర‌మ్ న‌టించిన ఇంకొక్క‌డు సినిమా వంద కోట్ల‌ను క‌లెక్ట్ చేసి మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం చియాన్ విక్ర‌మ్ విజయ్ చంద్రశేఖర్ ద‌ర్శ‌క‌త్వంలో చిత్రంలో న‌టిస్తున్నాడు.

ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయిప‌ల్ల‌వి న‌టిస్తుంద‌ని, త్వ‌ర‌లోనే ఆమెను సంప్ర‌దిస్తున్నామ‌ని తెలియ‌జేసిన ద‌ర్శ‌కుడు విజ‌య్ చంద‌ర్ అండ్ టీంకు సాయిప‌ల్ల‌వి మొండి చెయ్యి చూపించిన‌ట్లుంది. దాంతో ఇప్పుడు యూనిట్ సాహసం శ్వాసగా సాగిపో చిత్రంలో న‌టించిన హీరోయిన్ మంజిమ మోహ‌న్‌ను తెర‌పైకి తీసుకొచ్చేప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతానికి ఆమెతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ట‌. మొత్తం మీద విక్ర‌మ్ మ‌ల‌యాళ హీరోయిన్స్‌పైనే మ‌న‌సు ప‌డ్డ‌ట్టు క‌న‌ప‌డుతుంది. ఈ సినిమాలో రేసుగుర్రం, కిక్‌2 సినిమాల విల‌న్ ర‌వికిష‌న్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు.