‘‘ 30 దాటింది.. పొట్ట, జుట్టు.. చాలా కష్టాలున్నాయి’’ : పెళ్లాన్ని వెతికి పెట్టండి అంటోన్న విశ్వక్ సేన్

  • IndiaGlitz, [Thursday,January 13 2022]

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ సినిమాల విషయంలో దూకుడు పెంచారు. 'వెళ్లిపోమాకే', 'ఈ నగరానికి ఏమైంది', 'ఫలక్ నుమా దాస్', 'హిట్', 'పాగల్' వంటి సినిమాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన విశ్వక్ సేన్ ప్రస్తుతం.. 'అశోకవనంలో అర్జున కళ్యాణం' అనే సినిమా చేస్తున్నారు. ఇందులో అర్జున్ అనే వడ్డీ వ్యాపారిగా కనిపించనున్నారాయన. కొద్ది రోజుల క్రితం ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్ ను విడుదల చేశారు మేకర్స్.

తాజాగా ఈ సినిమాకి సంబంధించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు విశ్వక్ సేన్. 'ఇంకా రెండు రోజులే ఉంది.. పిల్లని వెతికి పెట్టండి లేదా కనీసం పడేయటానికి టిప్స్‌ అయినా ఇవ్వండి. వయసు 30 దాటింది. పొట్ట, జుట్టు.. చాలా కష్టాలున్నాయి' అంటూ ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. అల్లానికి పెళ్లాన్ని వెతికి పెట్టడంలో సాయం చేయమంటూ విశ్వక్ సేన్ కోరారు.

#HelpAllamFindPellam హ్యాష్‌ట్యాగ్‌తో మీ సూచనలు తెలియజేయాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా 'అశోకవనంలో అర్జున కళ్యాణం' సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనికి విద్యా సాగర్ చింతా దర్శకత్వం వహిస్తుండగా... ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో ఆయన కుమారుడు సుధీర్ ఈదర ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

కాగా.. ఇటీవల విశ్వక్ సేన్ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ అని తేలిందని... ప్రస్తుతం వైద్యుల సూచనలతో క్యారంటైన్‏లో ఉండి చికిత్స తీసుకుంటున్నాని విశ్వక్‌ సేన్ తెలిపారు. వ్యాక్సిన్ వేయించుకున్నా కరోనా వదలడం లేదని.. దయచేసి అందరూ మాస్కులు ధరించి అప్రమత్తంగా వుండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు విశ్వక్ సేన్.

More News

కింగ్ నాగార్జున చేతుల మీదుగా "డెత్ గేమ్" టీజర్ లాంచ్

శ్రీ సాయినాధ క్రియేషన్స్ బ్యానర్ పై అమర్ నాథ్ రెడ్డి, భాను శ్రీ, సోనీ, సురయా పర్విన్, హీరో హీరోయిన్ లుగా చేరన్ దర్శకత్వంలో

త్వరలో సినీ పరిశ్రమకు అనుకూలంగా జీవో : జగన్‌తో భేటీ అనంతరం చిరు వ్యాఖ్యలు

సినిమా టికెట్ ధరలు, ఇతర టాలీవుడ్‌కు సంబంధించిన సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సినీనటుడు చిరంజీవి భేటీ ముగిసింది.

త్వరలో "దొరకునా ఇటువంటి సేవ" మూవీ

సమాజంలో జరిగే చెడు విషయాలను ప్రశ్నిస్తూ మంచి సినిమా తీయడం చాలా కష్టం.. ప్రస్తుతం అక్రమ సంబంధాల కి సంబంధించిన క్రైమ్ విపరీతంగా పెరిగిపోతుంది..

శ్రీవిద్యానికేతన్‌కు యూనివర్సిటీ హోదా: ‘‘ చిన్న మొలకలు... కల్ప వృక్షంగా’’ మారాయంటూ మోహన్ బాబు ట్వీట్

హీరోగా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా, నిర్మాతగా, విద్యావేత్తగా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు

బ్యాడ్మింటన్ లీగ్‌లో కోవిడ్ కలకలం.. కిదాంబి శ్రీకాంత్ సహా ఏడుగురికి పాజిటివ్

భారత్‌లో కరోనా వైరస్ ప్రకంపనలు సృష్టిస్తోంది. నిపుణులు చెప్పినదాని కంటే వేగంగా కేసులు విస్తరిస్తున్నాయి.