‘‘ 30 దాటింది.. పొట్ట, జుట్టు.. చాలా కష్టాలున్నాయి’’ : పెళ్లాన్ని వెతికి పెట్టండి అంటోన్న విశ్వక్ సేన్
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ సినిమాల విషయంలో దూకుడు పెంచారు. 'వెళ్లిపోమాకే', 'ఈ నగరానికి ఏమైంది', 'ఫలక్ నుమా దాస్', 'హిట్', 'పాగల్' వంటి సినిమాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన విశ్వక్ సేన్ ప్రస్తుతం.. 'అశోకవనంలో అర్జున కళ్యాణం' అనే సినిమా చేస్తున్నారు. ఇందులో అర్జున్ అనే వడ్డీ వ్యాపారిగా కనిపించనున్నారాయన. కొద్ది రోజుల క్రితం ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్ ను విడుదల చేశారు మేకర్స్.
తాజాగా ఈ సినిమాకి సంబంధించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు విశ్వక్ సేన్. 'ఇంకా రెండు రోజులే ఉంది.. పిల్లని వెతికి పెట్టండి లేదా కనీసం పడేయటానికి టిప్స్ అయినా ఇవ్వండి. వయసు 30 దాటింది. పొట్ట, జుట్టు.. చాలా కష్టాలున్నాయి' అంటూ ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. అల్లానికి పెళ్లాన్ని వెతికి పెట్టడంలో సాయం చేయమంటూ విశ్వక్ సేన్ కోరారు.
#HelpAllamFindPellam హ్యాష్‌ట్యాగ్‌తో మీ సూచనలు తెలియజేయాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా 'అశోకవనంలో అర్జున కళ్యాణం' సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనికి విద్యా సాగర్ చింతా దర్శకత్వం వహిస్తుండగా... ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో ఆయన కుమారుడు సుధీర్ ఈదర ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
కాగా.. ఇటీవల విశ్వక్ సేన్ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ అని తేలిందని... ప్రస్తుతం వైద్యుల సూచనలతో క్యారంటైన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నాని విశ్వక్ సేన్ తెలిపారు. వ్యాక్సిన్ వేయించుకున్నా కరోనా వదలడం లేదని.. దయచేసి అందరూ మాస్కులు ధరించి అప్రమత్తంగా వుండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు విశ్వక్ సేన్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com