‘యు ఫ** గయ్స్ కాల్డ్ మీ’ : లైవ్‌లో హీరో విశ్వక్ సేన్ చిందులు.. బయటకు పొమ్మన్న యాంకర్
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమా రిలీజ్ కావడానికి ముందు దానిని ప్రమోట్ చేసుకోవడమన్నది ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల కాలం నుంచి వస్తున్నదే. అయితే అప్పట్లో పోస్టర్లు, మైక్‌లు, రేడియోలలో ప్రచారం చేసుకునేవారు. ప్రస్తుతం ఈ ప్రమోషన్ యాక్టివీటిస్ పూర్తిగా మారిపోయాయి. ఫస్ట్ లుక్, గ్లింప్స్, టీజర్, ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్, లిరికల్ సాంగ్స్, వీడియో సాంగ్స్ పేరిట పబ్లిసిటీలో వినూత్నమైన మార్పులు వచ్చేశాయి. దీనికి సోషల్ మీడియా ప్రమోషన్ అదనం. తద్వారా సినిమాకి హైప్ వచ్చి కలెక్షన్స్ బాగుంటాయని దర్శక నిర్మాతల ఆలోచన.
ఇక అసలు విషయంలోకి వెళితే.. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన చిత్రం ‘అశోక వనంలో అర్జున కల్యాణం’’. ఈ సినిమాకు వినూత్నంగా ప్రమోషన్ ప్లాన్ చేశారు మేకర్స్. దీనిలో భాగంగా హైదరాబాద్‌లో నడిరోడ్డు మీద చేసిన ప్రాంక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఓ యువకుడు.. హీరో పాత్రధారి అల్లం అర్జున్ కుమార్‌కి 33 ఏళ్లు అయినా పెళ్లి కాలేదని, తనకు బాధగా ఉందని.. తాను పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని హడావుడి చేస్తాడు.
దీంతో విశ్వక్ సేన్ ఆ యువకుడిని అడ్డుకుని... నేనే అర్జున్ కుమార్ అని సర్దిచెప్పే ప్రయత్నం చేసినా సదరు యువకుడు వినిపించుకోలేదు. అల్లం అర్జున్ కుమార్ మీరు (విశ్వక్ సేన్) కాదని, తను మీసాలతో ఉంటాడని.. తనకు పెళ్లి కాకపోతే చనిపోతానని మళ్లీ కేకలు పెట్టడం మొదలుపెడతాడు. దీంతో జోక్యం చేసుకున్న విశ్వక్ సేన్.. అల్లం అర్జున్ కుమార్‌కి మే 6న పెళ్లి అవుతుందని కంగారు పడొద్దని చెబుతాడు. చివరకు విశ్వక్ సేన్ తన కారులో ఆ యువకుడిని ఎక్కించి అక్కడ్నుంచి పంపేయడమే కాకుండా, తను ఆటోలో కారుని ఫాలో అవుతూ వుంటాడు. ప్రస్తుతం ఈ ప్రాంక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక్కడి వరకు బాగానే వుంది కానీ.. ఈ ప్రాంక్ వీడియోనే ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. నడిరోడ్డుపై పబ్లిక్‌ను డిస్ట్రబ్ చేసి న్యూసెన్స్ క్రియేట్ చేశారంటూ ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ యూనిట్‌పై లాయర్ అరుణ్ కుమార్ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఓ టాప్ మోస్ట్ తెలుగు న్యూస్ ఛానెల్లో డిబేట్ నిర్వహించగా.. దీనికి సినీ పరిశ్రమ నుంచి త్రిపురనేని చిట్టి హాజరయ్యారు. అయితే డిబేట్ జరుగుతున్న సమయంలో అనుమతి లేకుండా హీరో విశ్వక్ సేన్ సదరు స్టూడియోలోకి దూసుకొచ్చారు.
తాము చేసింది ప్రాంక్ వీడియో అని.. క్యాన్‌లో నీళ్లు తీసుకుని పెట్రోలు అని చూపించామే తప్ప, తాము పెట్రోలు వాడలేదని విశ్వక్ సేన్ వివరణ ఇచ్చాడు. లాయర్ అరుణ్ కుమార్‌కి పెట్రోల్‌కి, నీళ్లకు తేడా తెలియడం లేదా అంటూ ఫైర్ అయ్యారు. ఆ వెంటనే లైవ్‌లోకి వచ్చిన లాయర్ అరుణ్ కుమార్ ... ‘కోట్ల రూపాయలు కుమ్మరించి సినిమాలు తీసి, మీ స్వార్థం కోసం ప్రాంక్ వీడియోలు చేయడం సరికాదన్నారు.
ఈ డిస్కషన్ సాగుతుండగా.. డిబేట్ నిర్వహిస్తున్న లేడీ యాంకర్ని టార్గెట్ చేశారు విశ్వక్ సేన్. ‘‘నా నోటి దూల వల్ల, నేను మాట్లాడిన దాని వల్ల నేను డిప్రెషన్‌కి వెళ్లి పోయానని మీరు స్టేట్మెంట్ పాస్ చేయడం కరెక్ట్ కాదు. నా వ్యక్తిగత జీవితం గురించి మీకు తెలియదు. దాని గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. నాకు మీరు పాగల్ శీను అనే పేరు పెట్టారు. నేను కూడా మీపై పరువు నష్టం దావా వేయొచ్చు. కానీ తాను అలా చేయను. మీరు మీ నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడండి అంటూ హెచ్చరించారు.
ఆ మాటలకు లేడీ యాంకర్ ఫైరయ్యింది. యు గెటవుట్ ఫస్ట్ ఫ్రమ్ స్టూడియో అంటూ వార్నింగ్ ఇచ్చింది. దానికి భగ్గుమన్న విశ్వక్ సేన్ ‘యు ఫ** గయ్స్ కాల్డ్ మీ’’’ అంటూ లేడీ యాంకర్‌పై విరుచుకుపడ్డాడు. దీంతో సహనం కోల్పోయిన యాంకర్ ‘యు గెటవుట్ ఫస్ట్ ఫ్రమ్ స్టూడియో’ అంటూ అదే పనిగా చెప్పడంతో విశ్వక్ సేన్ స్టూడియో నుంచి బయటకు వెళ్లిపోయారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments