కోట్లు విలువ చేసే కారు కొన్న ‘పాగల్ ’ హీరో.. ధర తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే ..!!
Send us your feedback to audioarticles@vaarta.com
అశోక వనంలో అర్జున కళ్యాణం ప్రమోషన్ కార్యక్రమం వివాదానికి దారి తీసినా సినిమా మంచి విజయం సాధించడంతో హీరో విశ్వక్ సేన్ సక్సెస్ జోష్‌తో వున్నారు. తాజాగా ఆయన కొత్తగా కారును కొన్నారు. అది కూడా అలాంటి ఇలాంటిది కాదు. లగ్జరీ బ్రాండ్.. బెంజ్‌లో కూడా టాప్ ఎండ్ మోడల్స్‌లో ఒకదానిని తన సొంతం చేసుకున్నాడు. లేటెస్ట్ మోడల్ అయిన మెర్సిడెజ్ బెంజ్ జి వేగన్ 2022 కొన్నాడు. ఈ కారు ధర 2. 5 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకూ ఉంటుందని అంచనా.
నా డ్రీమ్ కారుని కొనుకున్నా... మీరు నాపై చూపిస్తున్న స్థిరమైన ప్రేమాభిమానాల వల్లే ఇది సాధ్యమైంది. నా జీవితంలో జరుగుతున్న ప్రతి విషయానికి ఎంతో ఆనందంగా ఉన్నా. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అని తన విశ్వక్ సేన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. కారుతో దిగిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అటు ఈ పోస్ట్‌పై డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఫన్నీగా కామెంట్ పెట్టాడు. ఈ కారు నాదే ఫోటోలు దిగుతాను అంటే ఇచ్చానని పోస్ట్ చేశాడు.
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఈ నగరానికి ఏమైంది' చిత్రం విశ్వక్ సేన్‌ను హీరోగా నిలబెట్టింది. అప్పటినుండి ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఏం జరిగినా తనకు నచ్చింది మాట్లాడడం, నచ్చనిదానిని ఎదిరించడం విశ్వక్‌కు యూత్‌లో ఫ్యాన్ బేస్ పెరిగేలా చేసింది. ఇటీవల ఫ్రాంక్ వివాదం సందర్భంగానూ అభిమానులు ఆయనకు అండగా నిలిచారు.
ఇకపోతే.. విద్యాసాగర్ చింత దర్శకత్వంలో తెరకెక్కిన అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ చిత్రంలో విశ్వక్సేన్ సరసన రుక్సార్ ధిల్లాన్ , రితికా నాయక్‌లు హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయింది. అశోకవనంలో డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న ఆహాలో మే 27 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే అఫిషీయల్ అనౌన్స్ మెంట్ రావాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com