టిక్‌టాక్‌లోకి విష్ణు ఎంట్రీ
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం సోషల్ మీడియా గురించి తెలియనివాడు లేదు. ప్రతి మనిషి జీవితంలో సోషల్ మీడియా ఏదో రకంగా భాగమైంది. ఇక సెలబ్రిటీల సంగతి చెప్పనక్కర్లేదు. ఏ విషయం చెప్పాలనుకున్నా వారికి సోషల్ మీడియానే వేదికగా మారుతోంది. ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలా ఏదో ఒక సోషల్ మీడియాలోభాగమైన మాధ్యమం ద్వారా వారు తమ వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను అప్డేట్ చేస్తున్నారు. సినీ సెలబ్రిటీలందరూ వారి అభిమానులకు ఈ సోషల్ మీడియా ద్వారా మరింత చేరువయ్యారు. వారిపై ఎలాంటి తప్పుడు వార్తలు వచ్చినా సోషల్ మీడియా ఆధారంగా చేసుకుని క్లారిటీ ఇస్తున్నారు.
ఇలాంటి సోషల్ మీడియాలో భాగమైన టిక్‌టాక్‌లోకి ఇప్పుడు హీరో మంచు విష్ణు ఎంట్రీ ఇచ్చారు. ఈ విషయాన్ని మంచు విష్ణు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశారు. టిక్‌టాక్‌లోకి ఎంట్రీ ఇస్తే తప్పేంటి అంటూ ఓ ఫన్నీ వీడియో తయారు చేసి దాన్ని పోస్ట్ చేయడం ద్వారా విష్ణు ఈ విషయాన్ని తెలిపారు. ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా ,నిర్మాతగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఆయన హీరోగా నటిస్తూ నిర్మిస్తోన్న చిత్రం మోసగాళ్ళు సెట్స్‌పై ఉంది. కరోనా ప్రభావంతో సినిమా చిత్రీకరణ ఆగింది. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి విడుదల తేదీని కన్ఫర్మ్ చేస్తారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments