టిక్‌టాక్‌లోకి విష్ణు ఎంట్రీ

  • IndiaGlitz, [Wednesday,May 06 2020]

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా గురించి తెలియ‌నివాడు లేదు. ప్ర‌తి మనిషి జీవితంలో సోష‌ల్ మీడియా ఏదో ర‌కంగా భాగ‌మైంది. ఇక సెల‌బ్రిటీల సంగ‌తి చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఏ విష‌యం చెప్పాల‌నుకున్నా వారికి సోష‌ల్ మీడియానే వేదిక‌గా మారుతోంది. ట్విట్ట‌ర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ ఇలా ఏదో ఒక సోష‌ల్ మీడియాలోభాగ‌మైన మాధ్య‌మం ద్వారా వారు త‌మ వ్య‌క్తిగ‌త‌, వృత్తిప‌ర‌మైన విష‌యాల‌ను అప్‌డేట్ చేస్తున్నారు. సినీ సెల‌బ్రిటీలంద‌రూ వారి అభిమానుల‌కు ఈ సోష‌ల్ మీడియా ద్వారా మ‌రింత చేరువ‌య్యారు. వారిపై ఎలాంటి త‌ప్పుడు వార్త‌లు వ‌చ్చినా సోష‌ల్ మీడియా ఆధారంగా చేసుకుని క్లారిటీ ఇస్తున్నారు.

ఇలాంటి సోష‌ల్ మీడియాలో భాగ‌మైన టిక్‌టాక్‌లోకి ఇప్పుడు హీరో మంచు విష్ణు ఎంట్రీ ఇచ్చారు. ఈ విష‌యాన్ని మంచు విష్ణు త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా తెలియ‌జేశారు. టిక్‌టాక్‌లోకి ఎంట్రీ ఇస్తే త‌ప్పేంటి అంటూ ఓ ఫ‌న్నీ వీడియో త‌యారు చేసి దాన్ని పోస్ట్ చేయ‌డం ద్వారా విష్ణు ఈ విష‌యాన్ని తెలిపారు. ప్ర‌స్తుతం మంచు విష్ణు హీరోగా ,నిర్మాత‌గా వ‌రుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఆయ‌న హీరోగా న‌టిస్తూ నిర్మిస్తోన్న చిత్రం మోస‌గాళ్ళు సెట్స్‌పై ఉంది. క‌రోనా ప్ర‌భావంతో సినిమా చిత్రీక‌ర‌ణ ఆగింది. క‌రోనా ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాత ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి విడుద‌ల తేదీని క‌న్‌ఫ‌ర్మ్ చేస్తారు.

More News

'కిమ్ చనిపోవడం' అంతా డ్రామానే.. అసలు కారణాలివీ..

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ (36)కు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారని.. పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ అమెరికా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

ఏపీ : పది పరీక్షలపై వదంతులు నమ్మొద్దు

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం విదితమే. ప్రస్తుతం 3.0 లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు

సీఎం జగన్ ఉదారత.. ఒక్కో వలస కూలీకి రూ. 500!

వలస కూలీల విషయంలో ఉదారంగా ఉండాలని, సంకోచించకుండా.. చొరవ తీసుకొని అవసరమైన వారికి సహాయం చేయాలని అధికారులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

త్వరలోనే దేశ వ్యాప్తంగా ప్రజా రవాణా..: కేంద్ర మంత్రి

భారతదేశ వ్యాప్తంగా త్వరలోనే ప్రజా రవాణా ఉంటుందని కేంద్ర రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరి స్పష్టం చేశారు. బుధవారం నాడు ఆయన.. దేశంలోని బస్సు, కార్ల ఆపరేటర్లతో ఆయన బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరీలో శ‌ర్వానంద్‌

జయాపజయాలు పట్టించుకోకుండా స్క్రిప్ట్ నచ్చితే సినిమాలు చేసే హీరోల్లో శర్వానంద్ ఒకరు. అందుకు ఉదాహరణ `లై` సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది. అయితే హీరో శ‌ర్వానంద్ ద‌ర్శ‌కుడిపై