హీరో విష్ణు కి కోపం వచ్చింది..
Send us your feedback to audioarticles@vaarta.com
మంచు విష్ణు - రాజ్ తరుణ్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ఈడోరకం - ఆడోరకం. జి.నాగేశ్వరరెడ్డి తెరకెక్కించిన ఈడోరకం - ఆడోరకం చిత్రం ఈరోజు రిలీజైంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా మీడియాతో మాట్లాడిన విష్ణుని రాజ్ తరుణ్ ని ఎంచుకోవడానికి కారణం ఏమిటి అని అడిగితే...రాజ్ తరుణ్ చేసిన క్యారెక్టర్ కోసం పలువురు కథానాయకుల్ని సంప్రదించాం. కానీ..ఎవరు ఇంట్రస్ట్ చూపించలేదు. ఆ సమయంలో సినిమా చూపిస్త మావ చూసాను. ఆ సినిమాలో రాజ్ తరుణ్ నటన నాకు బాగా నచ్చింది. ఈ సినిమాకి ఇతనైతే బాగుంటుందని అనిపించింది. రాజ్ తరుణ్ సంప్రదించి కథ చెబితే ఓకే అన్నాడు. అందుకనే రాజ్ తరుణ్ ని ఎంచుకున్నాం.
హిందీలో హీరోలు కలసి మెలిసి నటించి ఆర్ధికంగా సినిమా స్ధాయిని పెంచుతున్నారు. కానీ మనం మాత్రం బావిలో కప్పల్లా తయారయ్యాం. నేను ఎవరితో నటించడానికైనా సిద్దమే. ఐదు నిమిషాల పాత్ర అయినా ఫరవాలేదు. పాత్ర పరిథి ఎంత తక్కువు ఉన్నా..మెప్పించగలననే నమ్మకం నాలో ఉంది. ఆ నమ్మకం మిగిలిన హీరోల్లో లేదేమో అన్నారు. విష్ణు మాటలను బట్టి బాగా కోపం వచ్చినట్టు తెలుస్తుంది. మరి..విష్ణు కోరుకుంటున్నట్టు ఇక నుంచైనా పాత్ర పరిథి గురించి ఆలోచించకుండా మంచి పాత్రలో నటించే అవకాశం వస్తే బాలీవుడ్ హీరోల్లా టాలీవుడ్ హీరోలు కూడా ముందుకు వస్తారని ఆశిద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout