విశాల హృదయం: ఆ 1800 మంది పిల్లల బాధ్యత నాదే.. పునీత్‌కి విశాల్ ఘన నివాళి
Send us your feedback to audioarticles@vaarta.com
కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం యావత్ భారతీయ సినీ ప్రపంచాన్ని శోక సంద్రంలో ముంచింది. రీల్ హీరోగానే కాకుండా ఎనో సేవ కార్యక్రమాలతో రీయల్ హీరోగానూ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు పునీత్. 1800 మందికి పైగా పిల్లలకు ఉచిత విద్యను అందించడంతో పాటు 45 ఫ్రీ స్కూల్స్ , 26 అనాధాశ్రమాలు, 16 వృద్దాశ్రమాలు, 19 గోశాలలు కట్టించడంతో పాటు వాటి నిర్వహణను పునీత్ చేపట్టారు. అంతే కాదు చనిపోతూ కూడా ఒకరి జీవితంలో వెలుగులు నింపారు పునీత్. ఈ మేరకు తన రెండు కళ్ళను దానం చేశారు. ఇక పునీత్ మరణం పట్ల దక్షిణాదికి చెందిన అన్ని చిత్ర పరిశ్రమల నటీనటులు ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. అలాగే పునీత్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
ఈ క్రమంలో కోలీవుడ్ స్టార్ విశాల్ సైతం తన మిత్రుడికి నివాళులర్పించారు. ఆదివారం ఆయన నటించిన ‘‘ ఎనిమి ’’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా విశాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పునీత్ రాజ్ కుమార్ మరణం తర్వాత ఆయన చదివిస్తున్న 1800 మంది పిల్లల బాధ్యతను తాను తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే విశాల్ నటించిన సినిమాలకు సంబంధించిన ప్రతి టికెట్ ధర నుంచి ఒక రూపాయి రైతులకు చేరేలా చేస్తున్నారు. అంతే కాదు తనకు సంబంధించిన ఫంక్షన్స్‌లో బొకేలను వాడొద్దని వాటి కోసం ఖర్చుచేసే డబ్బు ఆడపిల్లల చదువుకు ఉపయోగించమని కోరుతూ ఉంటారు విశాల్. తాజాగా పునీత్ బాధ్యతను తన భుజాలపై వేసుకొని మరోసారి చిత్ర ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు విశాల్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout