Vishal: కొద్ది అడుగుల దూరంలో చావు.. వెంట్రుక వాసిలో తప్పించుకున్న విశాల్, వీడియో వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
మనకి రెండు గంటల పాటు వినోదం అందించేందుకు హీరోలు, హీరోయిన్లు ఎంతో కష్టపడతారు. ఈ క్రమంలో ప్రాణాలు పొగొట్టుకున్న వారు కూడా వున్నారు. ఇక కాళ్లు, చేతులు విరిగి మంచానికే పరిమితమైన వారు ఎందరో. అందుకే షూటింగ్ సమయంలో చిత్ర యూనిట్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. అయినప్పటికీ పలువురు హీరోలు ప్రమాదాల బారినపడుతూనే వున్నారు. తాజాగా తమిళ స్టార్ హీరో విశాల్ తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు.
సెట్లోకి దూసుకొచ్చిన భారీ ట్రక్కు :
ప్రస్తుతం విశాల్ మార్క్ ఆంటోనీ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్లో భాగంగా ఓ యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్నారు. దీని కోసం ఓ భారీ ట్రక్కును చిత్ర యూనిట్ వినియోగిస్తోంది. అయితే షూట్ సమయంలో ఆ ట్రక్కు అదుపు తప్పి స్టూడియోలో వున్న సెట్టింగ్స్‌ను ధ్వంసం చేసుకుంటూ దూసుకొచ్చింది. ఆ సమయంలో లోపల 100 మందికి పైగా కార్మికులు, సాంకేతిక నిపుణులు, హీరో విశాల్ కూడా వున్నారు. అయితే ట్రక్ రాకను గమనించిన యూనిట్ సభ్యులు విశాల్‌ను వెంటనే పక్కకు లాగారు. దీంతో ఆయన పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ప్రమాదంపై విశాల్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. చావు కొన్ని అంగుళాల దూరంలో కనిపించిందని, దీని తర్వాత అన్ని జాగ్రత్తలు తీసుకుని షూటింగ్లో పాల్గొన్నామని ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు సెట్లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
గతంలో లాఠీ, చక్ర షూటింగ్ సమయంలోనూ విశాల్‌కు గాయాలు :
ఇకపోతే.. గతేడాది లాఠీ సినిమా చిత్రీకరణ చేస్తున్న సమయంలోనూ గాయపడ్డాడు విశాల్. ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ఆయన ప్రమాదానికి గురయ్యారు. అంతకుముందు చక్ర అనే సినిమా షూటింగ్ సమయంలోనూ విశాల్ తలకు గాయాలయ్యాయి. తరచూ ఇలా గాయాల బారినపడతున్నప్పటికీ.. విశాల్ మాత్రం డూప్ లేకుండానే నటిస్తున్నారు. కాగా.. మార్క్ ఆంటోనీ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విశాల్ సరసన రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తుండగా.. ఎస్జే సూర్య, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Jus missed my life in a matter of few seconds and few inches, Thanks to the Almighty
— Vishal (@VishalKOfficial) February 22, 2023
Numb to this incident back on my feet and back to shoot, GB pic.twitter.com/bL7sbc9dOu
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments