Vishal: కొద్ది అడుగుల దూరంలో చావు.. వెంట్రుక వాసిలో తప్పించుకున్న విశాల్, వీడియో వైరల్

  • IndiaGlitz, [Thursday,February 23 2023]

మనకి రెండు గంటల పాటు వినోదం అందించేందుకు హీరోలు, హీరోయిన్లు ఎంతో కష్టపడతారు. ఈ క్రమంలో ప్రాణాలు పొగొట్టుకున్న వారు కూడా వున్నారు. ఇక కాళ్లు, చేతులు విరిగి మంచానికే పరిమితమైన వారు ఎందరో. అందుకే షూటింగ్ సమయంలో చిత్ర యూనిట్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. అయినప్పటికీ పలువురు హీరోలు ప్రమాదాల బారినపడుతూనే వున్నారు. తాజాగా తమిళ స్టార్ హీరో విశాల్ తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు.

సెట్‌లోకి దూసుకొచ్చిన భారీ ట్రక్కు :

ప్రస్తుతం విశాల్ మార్క్ ఆంటోనీ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌లో భాగంగా ఓ యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్నారు. దీని కోసం ఓ భారీ ట్రక్కును చిత్ర యూనిట్ వినియోగిస్తోంది. అయితే షూట్ సమయంలో ఆ ట్రక్కు అదుపు తప్పి స్టూడియోలో వున్న సెట్టింగ్స్‌ను ధ్వంసం చేసుకుంటూ దూసుకొచ్చింది. ఆ సమయంలో లోపల 100 మందికి పైగా కార్మికులు, సాంకేతిక నిపుణులు, హీరో విశాల్ కూడా వున్నారు. అయితే ట్రక్ రాకను గమనించిన యూనిట్ సభ్యులు విశాల్‌ను వెంటనే పక్కకు లాగారు. దీంతో ఆయన పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ప్రమాదంపై విశాల్ ‌ట్విట్టర్ ద్వారా స్పందించారు. చావు కొన్ని అంగుళాల దూరంలో కనిపించిందని, దీని తర్వాత అన్ని జాగ్రత్తలు తీసుకుని షూటింగ్‌లో పాల్గొన్నామని ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు సెట్‌లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

గతంలో లాఠీ, చక్ర షూటింగ్ సమయంలోనూ విశాల్‌కు గాయాలు :

ఇకపోతే.. గతేడాది లాఠీ సినిమా చిత్రీకరణ చేస్తున్న సమయంలోనూ గాయపడ్డాడు విశాల్. ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ఆయన ప్రమాదానికి గురయ్యారు. అంతకుముందు చక్ర అనే సినిమా షూటింగ్ సమయంలోనూ విశాల్ తలకు గాయాలయ్యాయి. తరచూ ఇలా గాయాల బారినపడతున్నప్పటికీ.. విశాల్ మాత్రం డూప్ లేకుండానే నటిస్తున్నారు. కాగా.. మార్క్ ఆంటోనీ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విశాల్ సరసన రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఎస్‌జే సూర్య, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

More News

Pawan Kalyan : జనసైనికుల బీమా కోసం పవన్ రూ.కోటి విరాళం.. వరుసగా మూడో ఏడాది

ప్రజలకు ఏదో ఒకటి చేయాలని, సమాజంలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో జనసేన పార్టీని స్థాపించారు పవన్ కల్యాణ్.

Prudhvi Raj:ఉగాది నాడు జనసేనలోకి 30 ఇయర్స్ పృథ్వీ.. పవన్ సమక్షంలో చేరిక,‘‘ఎమ్మెల్యే ’’గా బరిలోకి

థర్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ అంటూ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఖడ్గం సినిమాలో చెప్పిన ఒకే ఒక్క డైలాగ్‌తో టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్‌ చేశాడు పృథ్వీరాజ్.

Prabhu Ganesan : సీనియర్ నటుడు ప్రభుకు తీవ్ర అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు, ఆందోళనలో ఫ్యాన్స్

కోలీవుడ్ సీనియర్ నటుడు ప్రభు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.

Puli Meka:‘పులి మేక’ వంటి ఎంగేజింగ్ థ్రిల్లర్ ఆడియెన్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తుంది - డైరెక్ట‌ర్ బాబీ

ఇండియాలోనే వ‌న్ ఆఫ్ ది బెస్ట్ ఓటీటీల్లో ఒక‌టైన జీ 5 త‌మ ఆడియెన్స్ కోసం తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ, మ‌రాఠీ, గుజ‌రాతీ, బెంగాలీ స‌హా ఇత‌ర భాష‌ల్లో

APTA: ఎన్ఆర్ఐ సంస్థ ఏపీటీఏ సలహాదారుగా రవణం స్వామి నాయుడు.. !!

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికా గడ్డపైకి ప్రతి ఏటా వేలాది మంది భారతీయులు వెళ్తూ వుంటారు.