తండ్రికే లీగల్ నోటీసులు పంపి షాక్ ఇచ్చిన హీరో విజయ్

  • IndiaGlitz, [Wednesday,January 27 2021]

కోలీవుడ్ అగ్ర కథానాయకుల్లో ఒకరైన హీరో విజయ్‌కి మాస్‌లో ఉన్న ఆద‌ర‌ణ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఈయ‌న ఆద‌ర‌ణ‌ను చూసి, విజ‌య్ రాజ‌కీయాల్లోకి రావాల‌ని అంటున్న‌వారు కూడా చాలా మందే ఉన్నారు. అయితే విజ‌య్ మాత్రం రాజ‌కీయాల‌కు దూరంగానే ఉంటున్నారు. విజ‌య్ రాజ‌కీయాల్లోకి రావాల‌ని వాద‌నలు వినిపించిన ప్ర‌తిసారి, ఆయ‌న సినిమాల రిలీజ్‌లకు ఇబ్బంద‌లు ఎదుర‌య్యాయి. ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌చ్చినా విజ‌య్ మాత్రం రాజ‌కీయాల‌పై ఎప్పుడూ స్పందించ‌లేదు. త‌న సినిమాలు, త‌న ప‌ని అంటున్న‌ట్లు ముందుకు వెళ్లిపోతున్నారు.

ఈ ఏడాది వేస‌విలో త‌మిళ‌నాడులో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలో మ‌రోసారి విజ‌య్ పొలిటిక‌ల్ ఎంట్రీ గురించి ప్ర‌స్తావ‌న‌లు బాగానే వినిపించాయి. ఈ నేప‌థ్యంలో విజ‌య్ తండ్రి.. సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎ.చంద్ర‌శేఖ‌ర్ హీరో విజ‌య్ పేరు మీద రాజ‌కీయ పార్టీ.. అఖిల భార‌త ద‌ళ‌ప‌తి విజ‌య్ మ‌క్క‌ల్ ఇయ‌క్కం అనే పేరుతో రాజ‌కీయ పార్టీని స్థాపించారు. ఈ పార్టీ త‌ర‌పున విజ‌య్ రానున్న ఎన్నిక‌ల్లో పోటీ చేస్తార‌ని కూడా అప్ప‌ట్లో చంద్ర శేఖ‌ర్ తెలిపారు. అయితే దీనిపై విజ‌య్ వివ‌ర‌ణ ఇచ్చారు. త‌న‌కు, త‌న తండ్రి స్థాపించిన రాజ‌కీయ పార్టీకి సంబంధం లేద‌ని తేల్చి చెప్పేశారు. త‌న అభిమానుల‌కు ఇదే సూచ‌న‌ను చేశారు విజ‌య్‌. ఎన్నిక‌ల్లో త‌న తండ్రి చంద్ర‌శేఖ‌ర్ ఏ విధంగా త‌న ఫొటోను కానీ, పేరుని కానీ వాడుకోరాదంటూ విజ‌య్.. లీగ‌ల్ నోటీసుల‌ను పంపించార‌ట‌.

More News

సింగ‌రేణిలో ప్ర‌భాస్ ‘సలార్’ షూటింగ్

ప్ర‌భాస్ ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిన త‌ర్వాత ఆయ‌న కోసం ద‌ర్శ‌క నిర్మాత‌లు క్యూ క‌డుతున్నారు.

త‌మ‌న్నాకు కోర్టు నోటీసులు

మిల్కీబ్యూటీ త‌మ‌న్నాకు కోర్టు నోటీసుల రూపంలో షాక్ త‌గిలింది. సాధార‌ణంగా వివాదాల‌కు దూరంగా ఉండే త‌మన్నా భాటియాకు కోర్టు నోటీసులు రావ‌డ‌మేంటి?

పవన్ సినీ రీ ఎంట్రీపై నాదెండ్ల ఆసక్తికరమైన వ్యాఖ్యలు

పవర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ అజ్ఞాత‌వాసి సినిమా పూర్తి చేసిన త‌ర్వాత జ‌న‌సేన పార్టీతో పూర్తిగా రాజ‌కీయాల‌కే ప‌రిమితం అయ్యారు.

ఢిల్లీ ఘటనపై కేంద్రం సీరియస్...

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన విధ్వంస ఘటనలపై కేంద్రం సీరియస్ అయ్యింది.

ప్రకాశం: కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వైద్యురాలి పరిస్థితి విషమం

ప్రకాశం జిల్లాలో కరోనా వ్యాక్సిన్ వికటించింది. ఆ వ్యాక్సిన్ వేయించుకున్న ధనలక్ష్మి అనే యువ డాక్టర్ పరిస్థితి విషమంగా మారింది.