'గురు' సినిమా నాకెప్పుడూ స్పెషల్ - హీరో వెంకటేష్
Send us your feedback to audioarticles@vaarta.com
బాక్సింగ్ కోచ్‌గా విక్టరీ వెంకటేష్, శిష్యురాలి పాత్రలో రితికసింగ్ నటించిన చిత్రం `గురు`. హిందీలో సాలా ఖద్దూస్, తమిళంలో ఇరుదు సుట్రు అనే పేరుతో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో `గురు` పేరుతో వై నాట్ స్టూడియోస్ బ్యానర్‌పై సుధా కొంగ ప్రసాద్ దర్శకత్వంలో ఎస్.శశికాంత్ నిర్మించారు. మార్చి 31న విడుదలైన ఈ సినిమా మంచి ప్రశంసలు అందుకుంటూ సక్సస్‌ఫుల్‌గా రన్ అవుతుంది.
ఈ సందర్భంలో ..
నిజాయితీగా, నిబద్ధతగా ఒక మంచి సినిమా చేయాలన్న ప్రయత్నమే గురు సినిమా. సినిమా చూసిన నా స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఇండస్ట్రీ అంతా సినిమా బావుందని అప్రిసియేట్ చేశారు. గురు సినిమా యూనిట్ అంతా కలిసి ఓ మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలని ప్రయత్నించాం. అందుకోసం నేను కూడా చాలా హార్డ్ వర్క్ చేశాను. ఎందుకంటే రీసెంట్గా నేను చేస్తున్న సినిమాలను మోనాటనీగా నేనే ఫీలై ఏదైనా కొత్తగా చేయాలనుకున్నాను. అలాంటి సమయంలో సుధ కొంగర ఈ గురు కథతో వచ్చింది. ముప్పై ఏళ్ళ కెరీర్లో ఎన్నో సినిమాలు చేశాను. ఏన్నో అవార్డులు, రివార్డులు వచ్చినా గురు నాకు స్పెషల్ మూవీ. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా థాంక్స్ చెబుతున్నానని హీరో వెంకటేష్ తెలిపారు.
గురు సినిమా చాలా బావుందని సినిమా చూసిన వాళ్లందరూ అంటున్నారు. వార్తలను చూస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు గురులాంటి సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. డైరెక్షన్ చేయడం చాలా కష్టమైన పని. ముఖ్యంగా నాలాంటి ఏమీ తెలియని వారితో సినిమా చేయడం ఇంకా కష్టం. సుధగారు అద్భుతమైన కథతో సినిమాను తెరకెక్కించారు. గురు టీంను నా ఫ్యామిలీగా భావించాను అని రితిక సింగ్ తెలిపారు. మాది అంతా గురు ఫ్యామిలీగానే భావిస్తున్నాను. ఇందులో పార్ట్ కావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని ముంతాజ్ అన్నారు.
సినిమాను డైరెక్ట్ చేయడం. ప్రపంచంలో అతి కష్టమైన పనుల్లో ఒకటి. ప్రపంచంలో మూడో కష్టమైన సినిమా డైరెక్షన్ చేయడం. ఈ సినిమా జర్నీ ప్రారంభంలో నేను నిద్ర మధ్యలో లేచేసేదాన్ని. నేను చేస్తుంది కరెక్టా..కాదా అని ఆలోచించుకునేదాన్ని., ఆ ఛాలెంజెస్, ఒత్తిడులన్నీ ఈ గురుతో తీరిపోయాయి. ఇంత మంచి సినిమా నేను చేయడానికి కారణమైన వ్యక్తుల్లో నిర్మాత శశికాంత్ సపోర్ట్ మరచిపోలేం. ఆయన ఏ డబ్బులు తీసుకోకుండా సినిమాను నిర్మించారు. అలాగే వెంకటేష్‌గారు ఎంతో డేడికేషన్‌తో సినిమాలో భాగమయ్యారు. రితిక, ముంతాజ్ నాలుగేళ్ళుగా నాతో ట్రావెల్ చేస్తున్నారు అందరికీ థాంక్స్ అని డైరెక్టర్ సుధ కొంగర చెప్పారు.
మూడు భాషల్లో నాలుగేళ్ళ పాటు గురు ప్రయాణం సాగింది. ఈ జర్నీలో భాగమైన అందరికీ థాంక్స్. మా వై నాట్ స్టూడియోస బ్యానర్లో మంచి సినిమాలే వస్తాయని గురు చిత్రం మరోసారి నిజం చేసింది. వెంకటేష్ గారు నిర్మాతల హీరో. సెట్లో ముందు నిర్మాతలా ఆలోచిస్తారు., తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్లా ఆలోచిస్తారు. తర్వాతే నటుడులా ఆలోచిస్తారు. రిత్విక, ముంతాజ్ సహా ఈ సినిమా సక్సెస్‌లో భాగమైన అందరికీ థాంక్స్ అని నిర్మాత ఎస్.శశికాంత్ తెలియజేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout