ఎక్కువ ట్విస్ట్‌లు, టర్నింగ్‌లు ఉన్న ఎంగేజింగ్ కథ ‘అద్భుతం’ : యంగ్ హీరో తేజ సజ్జా
Send us your feedback to audioarticles@vaarta.com
‘ఓ బేబి’, ‘జాంబిరెడ్డి’ వంటి విజయవంతమైన చిత్రాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో, హీరో డా॥రాజశేఖర్ కూతురు శివాని రాజశేఖర్ హీరోయిన్‌గా రామ్‌మల్లిక్ దర్శకత్వంలో చంద్రశేఖర్ మొగుళ్ళ నిర్మించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘అద్భుతం’. ఈ సినిమాకు రధన్ సంగీతం అందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి నిజంగా ‘అద్భుతం’ అనే రెస్పాన్స్ వచ్చింది. ప్రముఖ ఎంటర్‌టైన్ ప్లాట్‌ఫాం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో నవంబర్ 19న స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా హీరో తేజ సజ్జ మీడియాతో సినిమా విశేషాలను పంచు కున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..‘‘కథ విషయానికి వస్తే ఒక యూనివర్సల్ ప్రాబ్లమ్ వలన ఇద్దరికి ఒకే ఫోన్ నెంబరు రావడం జరుగుతుంది. అయితే హీరో ఫోన్ నంబర్.. హీరోయిన్ ఫోన్ నంబర్ ఒకటే కావడం, అదే వాళ్ల పరిచయానికి కారణం కావడం. అనే అంశాల చుట్టూ ఈ కథ నడుస్తుంది.ఈ కథ ఫ్రెష్‌గా ఫుల్ ఎంటర్‌టైన్డ్‌గా ఉంటుంది. కరోనా ఎఫెక్ట్ వల్ల ఎన్నో చిత్రాలు విడుదలకు ఇబ్బందు పడుతున్న సంగతి తెలిసిందే. కానీ నా విషయానికి వస్తే మాత్రం చాలా హ్యాపీ. ఈ సంవత్సరం విడుదలౌతున్న నా 3వ చిత్రం ఇది. ఒక టిపికల్ సబ్జెక్ట్‌ను దర్శకుడు రామ్ మల్లిక్ గారు నిజంగానే ‘అద్భుతం’గా డీల్ చేశారు. ‘ఓ బేబీ’ సినిమా కన్నా ముందు ఈ ప్రాజెక్ట్ అనుకున్నాం. ఇక షూట్‌కు వెళ్లిపోదాం అనుకుంటుండగా, ‘ఓ బేబీ’ అవకాశం వచ్చింది నాకు. ఆ సినిమా ద్వారా ఎక్కువమంది ఆడియెన్స్‌కు రీచ్ అయ్యే అవకాశం ఉండటంతో అది ఈ సినిమాకు ప్లస్ అవుతుందనే స్వార్ధంతో ముందుగా ‘ఓ బేబీ’ చేశాను. ప్రేక్షకుల ఊహలను, అంచలనాలను తలక్రిందులు చేస్తూ ఎక్కువ ట్విస్ట్‌లు, టర్నింగ్‌లు ఉన్న ఎంగేజింగ్ కథ ఇది. ఎప్పుడూ కథకే నా ప్రాధాన్యం. సినిమా కంటెంట్ బాగుంటే, ఎంత లోప్రొఫైల్‌లో ఉన్నా రిలీజ్ దగ్గరకు వచ్చే సరికి చక్కటి పబ్లిసిటీతో ప్రేక్షకులను చేరే ఛాన్స్ ఉంటుంది అనేది నా అభిప్రాయం. నాకు ఆడియెన్స్‌కు ఎప్పుడూ ఒక ఇంట్రస్ట్ క్రియేట్ చేయాలనే ఆలోచన ఉంటుంది. అందుకు కొత్త కొత్త జోనర్‌లను ఎంచుకోవటం ఒక బెస్ట్ రూట్. ఇది కూడా అలా ఆడియెన్స్‌ను కట్టి పడేసే ఒక సరికొత్త జోనర్ ప్రేమకథ ఈ ‘అద్భుతం’. ట్రైలర్ చూసిన ప్రేక్షకుల అంచనాలకు మరెన్నో వండర్స్ యాడ్ చేసే సినిమా ఇది’’ అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments