'సింగం3' చేయడం రెస్పాన్సిబిలిటీగా భావించాను - హీరో సూర్య

  • IndiaGlitz, [Monday,February 06 2017]

సూర్య‌, అనుష్క‌, శృతిహాస‌న్ హీరో హీరోయిన్లుగా హ‌రి ద‌ర్శ‌క‌త్వంలో రానున్న సినిమా 'సింగం3'. తమిళంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా నిర్మించిన ఈ చిత్రాన్ని సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బేబి త్రిష సమర్పణలో మల్కాపురం శివకుమార్ తెలుగులో నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 9న ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల‌వుతున్న సంద‌ర్భంగా హీరో సూర్య పాత్రికేయుల‌తో సినిమా గురించి మాట్లాడారు...

మ‌న చేతుల్లో లేదు...

ఎంత ప్లానింగ్‌లో ఉన్నా కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు. తమిళనాడు ముఖ్య‌మంత్రి చ‌నిపోవ‌డం, స‌హా రాష్ట్రంలో జరిగిన పలు ఉద్యమాల కారణంగా సినిమాను వాయిదా వేశాం. జల్లికట్టును అనుమతించాలంటూ చేసిన ఆ ఉద్యమానికి నేనూ సపోర్ట్ ఇచ్చా. ఇలాంటి పోరాటాలు జరిగడం వల్లనే సినిమా వాయిదా పడింది కాబట్టి, నేనైతే ఎప్పుడూ ఇబ్బందిగా ఫీలవ్వలేదు.

సారీ చెప్ప‌డంతో ముగిసింది...

సింగం3 రిలీజ్ కార‌ణంగానే నేను జ‌ల్లిక‌ట్టుకు మ‌ద్ధ‌తిచ్చాన‌ని పెటా ప్ర‌చారం చేసింది. అయితే నేను గ్రామంలో పుట్టి పెరిగాను. నాకు త‌మిళ‌నాడు సంప్ర‌దాయాలు తెలుసు. వాటిని గౌర‌వించ‌డం కోసం త‌మిళ ప్ర‌జ‌ల‌కు నా సపోర్ట్ చెప్పాను. కానీ పెటా అలా త‌ప్పుడు ప్ర‌చారం చేయ‌డంతో నేను కేసు వేశాను. కానీ పెటా వాళ్ళు సారీ చెప్పడంతోనే ఆ గొడవ ముగిసింది.

అలాంటినే న‌న్ను ఎగ్జ‌యిట్ చేశాయి...

సింగం 3 సినిమా నిజ‌మైన పోలీస్ ఆఫీసర్ జీవితాల‌ను ఆధారంగా చేసుకుని రాసుకున్న క‌థ‌. సినిమాలో చూపిన‌ట్టు యాక్ష‌న్ సీక్వెన్స్ రియ‌ల్ లైఫ్‌లో ఉండ‌క‌పోవ‌చ్చు కానీ, క‌థ మాత్రం మ‌న సోసైటీలో పోలీసుల‌ను చూసి రాసుకున్న‌దే. పోలీస్ ఆఫీస‌ర్స్ కొన్ని కేసుల‌ను ఎలా హ్యాండిల్ చేస్తార‌నే దానిపై వారిని క‌లిసి వారితో మాట్లాడాం స‌న్నివేశాల‌ను రాసుకున్నాం. ఉదాహ‌ర‌ణ చెప్పాలంటే ఐపీయ‌స్ ఆఫీస‌ర్ సి.వి.ఆనంద్‌గారిని క‌లిసిన‌ప్పుడు ఆయ‌న త‌న ఎక్స్‌పీరియెన్స్‌లో త‌ను ఫేస్ చేసిన ఇలాంటి ఓ ఘ‌ట‌న‌ను చెప్పారు. ఇక్క‌డి గ‌వ‌ర్న‌మెంట్ స‌హ‌కారంతో, బ్యాంకాక్ చేరుకుని, అక్క‌డి పోలీసులు స‌హాకారంతో కృషి బ్యాంక్ నిందితుల‌ను అరెస్ట్ చేశారని చెప్పారు. అంటే ఈ సినిమాలో చూపించిన వాటిలో ఎన‌బైశాతం పాజిబిలిటీ ఉంటుంద‌ని మాకు తెలిసింది. అలాంటి ఆఫీస‌ర్స్ చెబుతున్న విష‌యాల‌ను వింటుంటే ఎగ్జ‌యిటింగ్‌గానే అనిపిస్తుంది. నేను పోలీస్ పాత్ర‌ల్లో న‌టించిన కాక్క కాక్క, సింగం సీక్వెల్స్ సినిమాల‌ను కొత్త‌గా స‌ర్వీసులోకి రాబోయే పోలీస్ ఆఫీస‌ర్స్ చూపిస్తార‌ని తెలిసింది. ఇలాంటి సినిమాల ప‌ట్ల ఉన్న ఇలాంటి రెస్పెక్ట్ చూసి కూడా ఎగ్జ‌యిట్‌మెంట్‌కు గురి చేస్తుంది.

కొత్త‌ద‌నం కోస‌మే అలా చేశాం...

నిజానికి మాకిది చాలా టఫ్ డెసిషన్. అయితే కొన్నిసార్లు సినిమా గురించే ఆలోచించాల్సి వస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ కాకుండా మాకు హరీస్ జైరాజ్ ఒక్కడే కనిపించడంతో ఆయనను తీసుకున్నాం. దేవీ కూడా మాకు సపోర్ట్‌గా నిలిచి, ఆల్ ది బెస్ట్ చెబుతూ ఈ ప్రాజెక్టును వదులుకున్నాడు. సినిమా ప‌రంగా కొత్త‌గా చేయాల‌నిపించింది. అంత‌కు ముందు వేరే క‌థ అనుకున్న‌ప్పుడు ఆ సినిమాకు హారీష్ జైరాజ్ మ్యూజిక్ ఇవ్వాల్సింది. అలా సినిమా స్థానంలో సింగం 3 చేయ‌డంతో హారీష్ జైరాజ్‌గారు ఈ ప్రాజెక్ట్‌లో ఇన్‌వాల్వ్ అయ్యారు.

బోర్ కొట్ట‌లేదు...

ముందు ఒక మిల‌ట‌రీ నేప‌థ్యంలో సినిమా చేయాల‌నుకున్నాం. క‌థా చర్చ‌లు కూడా జ‌రిగాయి. అయితే ఆ మ‌ధ్య‌లో నేను, దర్శకుడు హరి ఎక్కడికెళ్ళినా మమ్మల్ని సింగం సిరీస్ గురించే అడిగేవారు. సీక్వెల్స్ తీస్తూనే ఉండండి' అని కూడా చెప్పారు. ప్రేక్షకులు అంత బలంగా కోరుకుంటున్నప్పుడు సీక్వెల్ చేస్తూండడం తప్పగా కాకుండా రెస్పాన్సిబిలిటీగా భావించాను.

శృతిహాస‌న్ గురించి...

శృతి హాసన్‌కు కెరీర్‌ పరంగా ఈ సినిమాలోని రోల్ లో చేసిన పెర్‌ఫార్మెన్స్ ఆమెకు ఓ మంచి పేరు తెస్తుందనుకుంటున్నా. కథకు కీలకమైన పాత్రలో ఆమె చాలా బాగా నటించింది.

మీ భార్య జ్యోతిక చే్స్తు్న్న కొత్త సినిమా గురించి...

వినూత్నమైన సినిమాలు చేస్తూ జ్యో అందరినీ బాగా మెప్పిస్తోంది. ఒక భర్తగా అన్నివిధాలా తనకు అండగా నిలబడే ప్రయత్నం చేస్తున్నా. తను ఇప్పుడు ఒప్పుకున్న సినిమాలన్నీ కొత్తదనం ఉన్నవే. మ‌గ‌లిర్ మ‌ట్రుమ్‌(ఆడ‌వాళ్ల‌కు మాత్ర‌మే) అనే ఈ సినిమా ఆడ‌వాళ్ల‌కే కాదు, మ‌గ‌వాళ్ల‌కు కూడా సంబంధించింది. న‌లుగు మ‌హిళ‌ల జీవ‌న ప్ర‌యాణం.

దర్శకుడు హరి గురించి ...

హరి అన్ని క్రాఫ్ట్‌లపై మంచి పట్టు ఉన్న దర్శకుడు. షూట్ లేనిరోజు కూడా సినిమా గురించే ఆలోచిస్తూ చాలా కష్టపడుతూంటాడు. సెట్లో అయితే 5000 మంది ఉన్నా కూడా ఒక్క సైగతో అంతా సైలెంట్ చేయగల సమర్ధుడు.

తదుపరి చిత్రాలు...

ప్ర‌స్తుతం విఘ్నేష్ శివ‌న్ దర్శకత్వంలో తానా సెందా కూట్టం' అనే సినిమా చేస్తున్నా. ఈ మధ్యే ఆ సినిమా మొదలైంది.

More News

Doctors quell rumours on Jayalalithaa's treatment & Death

After 73 days of fighting for life at Apollo Hospitals, Chief Minister Selvi J.Jayalalithaa breathed her last on the 5th of December, 2016. With earlier notifications from the Hospital management saying that Jayalalithaa had recovered and will return home soon, the denial of entry of various dignitaries who had come to pay her a visit, and the complete confidence that was maintained about the trea

Court's shocking order on 'Si3' producer's petition against piracy

Actor Suriya's 'Si3' will be hitting the screens this Thursday (February 9, 2017). An illegal torrent download site has announced in its Facebook page that they will live stream the film on at 11 am on the same day...

Ashok Selvan's new Tamil film launched today

Young and promising hero Ashok Selvan is presently busy with multiple projects in Tamil cinema. Today (February 6, 2017) a new film with the 'Thegidi' actor in lead role has been launched with a formal pooja...

Vishal's mentor as his villain in 'Irumbu Thirai'

A few weeks back it was announced that actor Arya who was supposed to play the lead villain to his contemporary hero Vishal in 'Irumbu Thirai' has quit the project...

Director Hari's emotional request to the public ahead of 'Si3' release

In an exclusive interview with IndiaGlitz, 'Si3' director, Hari expressed his wholehearted concerns on video piracy. The maker of the Singam franchise was really humble when it came down to enlightening the public about movie piracy and how it affected the film's crew...