ఉదయం చిరంజీవి.. ఇప్పుడు శ్రీకాంత్, తెలుగు ఇండస్ట్రీపై కోవిడ్ పడగ
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు చిత్ర పరిశ్రమపై కోవిడ్ పగబట్టినట్లుగా వుంది. ఇప్పటికే మహేశ్ బాబు, మంచు లక్ష్మీ, మంచు విష్ణు, విశ్వక్ సేన్, రాజేంద్ర ప్రసాద్, తమన్ తదితరులు వైరస్ బారినపడ్డారు. ఇవాళ మెగాస్టార్ చిరంజీవికి కూడా పాజిటివ్‌గా తేలింది. తాను ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వైరస్ బారినపడ్డానని మెగాస్టార్ ట్వీట్ చేశారు. కొద్దిగంటల్లోనే హీరో శ్రీకాంత్ కూడా కరోనా బారినపడ్డారు. గత కొన్ని రోజులుగా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వైరస్ సోకింది.. ఇటీవలికాలంలో నన్ను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని శ్రీకాంత్ ట్వీట్టర్ ద్వారా పేర్కొన్నారు.
కాగా.. ఫ్యామిలీ హీరోగా తెలుగువారిని అలరించిన శ్రీకాంత్.. యువతరం రాకతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టర్న్ అయ్యారు. సరైనోడు సినిమాలో అల్లు అర్జున్‌కు బాబాయ్‌గా నటించి మెప్పించారు. అయితే తన సహచర నటుడు జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్‌గా జీవించడం.. ఆ తర్వాతి నుంచి ఆయన బిజీ కావడంతో తాను కూడా విలన్‌గా మారాలని శ్రీకాంత్ నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన ‘‘అఖండ’’లో ఆయన ప్రతినాయక పాత్ర పోషించారు. ఈ రోల్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో ఆయనకు వరుసపెట్టి నెగిటివ్ రోల్స్ క్యూకడుతున్నాయి.
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా శ్రీకాంత్ విలన్ రోల్ చేయబోతున్నారు. ఇందులో తన క్యారెక్టర్ ఓ రేంజ్‌లో వుంటుందని ఓ ఇంటర్యూలో శ్రీకాంత్ వెల్లడించారు. శ్రీకాంత్ కోవిడ్ బారినపడటంతో కొన్ని రోజుల పాటు ఇంటికే పరిమితం కానున్నారు. దీంతో ఆయన చేస్తున్న ప్రాజెక్ట్‌లకు షూటింగ్‌లు వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com