Bigg Boss 7 Telugu : కోపంతో ఊగిపోయిన శివాజీ , షాకైన కంటెస్టెంట్స్.. ‘‘కీ’’ కోసం జాగారం.. కానీ
Send us your feedback to audioarticles@vaarta.com
సోమ, మంగళవారాలు నామినేషన్స్‌తో హౌస్ హీటెక్కడంతో బిగ్‌బాస్ ఇంటిని కూల్ చేసే పని మొదలెట్టాడు. మాయ అస్త్ర కోసం ఇంటి సభ్యులకు టాస్క్ ఇచ్చి ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ లాగడం మొదలెట్టాడు. ఈ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులను రెండు గ్రూపులుగా విభజించి.. రణధీర, మహాబలిగా వాటికి పేర్లు పెట్టాడు. రణధీర గ్రూప్‌లో (శివాజీ, అమర్‌దీప్ చౌదరి, ప్రిన్స్, ప్రియాంక, శోభాశెట్టి, షకీలా)లు.. మహాబలి టీమ్‌లో టేస్టీ తేజ, దామిని, శుభశ్రీ, రతిక, పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ వున్నారు. మంగళవారం నాటి టాస్క్‌లో ‘‘పుల్ రాజా పుల్’’లో రణధీర జట్టు గెలిచింది. దీంతో వీరికి బిగ్‌బాస్ తాళం చెవి ఇచ్చాడు. అయితే దీనిని కొట్టేయాలని మహాబలి టీమ్ ప్లాన్ చేసింది.
పథకం ప్రకారం.. అర్ధరాత్రి కావడంతో అంతా నిద్రపోయాక మహాబలి టీమ్ ఈ తాళం కోసం రాత్రంతా నిద్రపోకుండా ప్రయత్నించాడు. సరిగ్గా ఇదే సమయంలో శుభశ్రీ దగ్గరకొచ్చిన శివాజీ యాక్టింగ్ ఇరగదీస్తున్నావ్ అన్నాడు. శివాజీ ఆ తాళం చెవిని నడుముకు వేసుకునే బెల్ట్‌లో దాచి పడుకుంటాడు. దీనిని ప్రశాంత్ గమనిస్తాడు. అయితే తాళంతో పనికాదని ఏకంగా సందీప్ పవర్ అస్త్రను కొట్టేస్తే పోలా అని భావించిన శుభశ్రీ, దామినీలు స్కెచ్‌లు వేయడం మొదలుట్టారు. శుభశ్రీ పవర్ అస్త్రను దొంగిలించి బాత్రూమ్‌లో దాచింది.
ఈ క్రమంలోనే మరో గేమ్ పెట్టాడు బిగ్‌బాస్.. ‘‘మలుపులో ఉంది గెలుపు’’ అని స్పిన్ విల్ ముల్లు ఆగే రంగుని రెండు జట్ల సభ్యులు ఫాలో కావాల్సి వుంటుంది. అది ఏ రంగు వద్ద అయితే వచ్చి ఆగుతుందో.. కంటెస్టెంట్స్ తమ ఎదురుగా వున్న బల్లపై వున్న సర్కిల్‌లో ఆ రంగుపై చేతులు లేదా కాలు పెట్టాల్సి వుంటుంది. ఇందులో ఎవరైతే ముందు తప్పు చేస్తారో వాళ్లు ఓడిపోయినట్లు. ఈ టాస్క్‌లోనూ రణధీర టీమ్ గెలిచి.. రెండో కీని అందుకుంది. ఎట్టకేలకు మాయ అస్త్రను సాధించిన రణధీర టీమ్.. అందులో వున్న ఆరు చక్రాలను తీసుకున్నారు. దీంతో రణధీర టీమ్ సంబరాల్లో తేలిపోయింది. అలాగే కొనసాగితే అది బిగ్‌బాస్ ఎందుకవుతుంది. వీరి మధ్య చిచ్చు పెట్టాలని స్కెచ్ గీశాడు. పవర్ అస్త్ర కోసం ఎవరైతే చక్రాలు తీసుకున్నారో.. ఆ ఆరుగురే పోటీ పడాల్సి వుంటుందని చెప్పి షాకిచ్చాడు.
బిగ్‌బాస్ 7లో తెలుగురాని వాళ్లని తీసుకొచ్చి జనానికి విసుగు తెప్పిస్తున్నాడు బిగ్‌బాస్. తెలుగు రాదని తెలిసి అసలు వాళ్లను ఎందుకు తీసుకోవాలని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇప్పటికే కిరణ్ రాథోడ్‌ను తెలుగురాని కారణం చేతే ప్రేక్షకులు ఎలిమినేట్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. ఆమె కూడా హౌస్‌లో భాష రాక చాలా ఇబ్బంది పడింది. స్వయంగా నాగార్జున సైతం తెలుగు నేర్చుకోవాలని కిరణ్‌కి చెప్పారు. అంతలోనే ఆమె ఎలిమినేట్ అయ్యింది. ఇప్పుడు హౌస్‌లో వున్న మరో తెలుగు రాని కంటెస్టెంట్ ప్రిన్స్ యావర్ ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు. ప్రిన్స్‌ని లాన్ ఏరియాకు పిలిచిన బిగ్‌బాస్ ‘‘ఇంట్లో వున్నంత కాలం తెలుగులోనే మాట్లాడతాను’’ అనే పదాన్ని చదవాల్సిందిగా పనిష్మెంట్ ఇచ్చాడు.
అయితే తాళం చెవి ప్రిన్స్ దగ్గరే వుందని అనుకుంటున్న మహాబలి టీమ్ అతనిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించింది. దీనిని చూసి చిర్రెత్తుకొచ్చిన శివాజీ.. ప్రిన్స్‌ను డిస్ట్రబ్ చేయొద్దని వాళ్లను హెచ్చరించాడు. అయినా ఒక్కొక్కరిగా రణధీర్ టీమ్ ప్రిన్స్‌ను డిస్ట్రబ్ చేస్తూనే వుంది. తన మాటలను పట్టించుకోలేదన్న కోపంతో ఊగిపోయిన శివాజీ.. జిమ్ ఏరియాలో వున్న డంబెల్స్‌ను పట్టుకుని గార్డెన్‌లోకి విసిరేశాడు. దీంతో కంటెస్టెంట్స్ షాకయ్యారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments