Sharwanand: బ్యాచిలర్ లైఫ్‌కి ఫుల్ స్టాప్.. ఇంటివాడు కాబోతున్న శర్వానంద్, అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాకే
Send us your feedback to audioarticles@vaarta.com
భారతీయ చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్‌గా వున్న నటీనటులు ఒక్కొక్కరిగా పెళ్లి పీటలు ఎక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్డౌన్లో చాలా మంది తారలు ఇష్టమైన వ్యక్తులను మనువాడారు. బాలీవుడ్ టూ టాలీవుడ్ ఇదే తంతు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో బ్యాచిలర్‌గా వున్న వారిలో శర్వానంద్ ఒకరు. పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిదనే రకం శర్వానంద్. కథాబలం వున్న సినిమాలనే చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు శర్వా. ముఖ్యంగా యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఆయనకు మంచి ఫాలోయింగ్ వుంది. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 18 ఏళ్లు కావొస్తున్నా ఇప్పటికీ అదే క్రమశిక్షణతో మెలుగుతారు శర్వా. ప్రస్థానం, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, గమ్యం, శతమానం భవతి, మహానుభావుడు వంటి సినిమాలు ఆయనను నటుడిగా నిలబెట్టాయి.
పెళ్లెప్పుడు అన్న ప్రశ్నకు స్పందించని శర్వానంద్ :
ఇదిలావుండగా తన తోటి హీరోలంతా పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడవుతూ వుండటంతో శర్వానంద్‌ని కనిపించిన వారంతా పెళ్లప్పుడు అని అడుగుతున్నారు. దీనికి ఆయన చిరు నవ్వుతో సమాధానం చెబుతున్నారు. ఇటీవల బాలయ్య టాక్ షో ‘అన్‌స్టాపబుల్ సీజన్2’లోనూ ఇదే ప్రశ్న ఎదురు కాగా.. శర్వా దాట వేసే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో సస్పెన్స్‌కు తెరదించారు శర్వానంద్. తెలుగు రాష్ట్రాల్లో మంచి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ వున్న కుటుంబానికి చెందిన అమ్మాయిని ఆయన త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు.
పెళ్లి కూతురు మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనుమరాలు:
శర్వానంద్‌కు కాబోయే భార్య పేరు రక్షిత రెడ్డిగా తెలుస్తోంది. ఈవిడ ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారట. తెలంగాణ హైకోర్ట్ న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె అని తెలుస్తోంది. అంతేకాదు .. టీడీపీ సీనియర్ నేత, దివంగత మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాలని సమాచారం. వీరిద్దరి నిశ్చితార్ధం ఈ నెల 26న గ్రాండ్‌గా జరగనుందట. అంతా బాగానే వుంది కానీ.. శర్వానంద్‌ది, రక్షితది వేర్వేరు కులాలు. ఈ క్రమంలో వీరిది ప్రేమ వివాహమా, లేక పెద్దలు కుదిర్చిన వివాహమా అనేది తెలియాల్సి వుంది. ఏది ఏమైనప్పటికీ తమ అభిమాన హీరో పెళ్లి పీటలు ఎక్కబోతుండటంతో శర్వానంద్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout