Sachin Joshi : దావూద్ ఇబ్రహీంతో లింకులు.. 'మౌనమేలనోయి' హీరో సచిన్ జోషి తండ్రికి పదేళ్ల జైలు
Send us your feedback to audioarticles@vaarta.com
సినీనటుడు సచిన్ జోషి (Sachin Joshi)తండ్రి జేఎం జోషికి న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష విధించింది. పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఓ గుట్కా యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి జేఎం జోషి , మరో ఇద్దరు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సాయం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. గుట్కా ఉత్పత్తిదారుడుగా వున్న జేఎం జోషి, అతని ప్రత్యర్ధి రసిక్‌లాల్ ధారివాల్‌కు మధ్య 2002లో వివాదం తలెత్తగా జోషి దీని పరిష్కారానికి ఇబ్రహీంను ఆశ్రయించారు. దీనిని పరిష్కరించినందుకు ప్రతిఫలంగా జోషి.. పాకిస్తాన్‌లో ఆశ్రయం పొందుతున్న దావూద్ ఇబ్రహీం కోసం ఓ గుట్కా యూనిట్‌ను ఏర్పాటు చేశాడు.
మౌనమేలనోయి సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ:
ఇకపోతే.. 2002లో మౌనమేలనోయి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు సచినో జోషి (Hero Sachin Joshi). తర్వాత ఒరేయ్ పండు, నిను చూడక నేనుండలేను, జాక్‌పాట్, నీ జతగా నేనుండాలి లాంటి సినిమాలు చేశాడు. వీటిలో చెప్పుకోదగ్గ విజయాలు లేకపోవడంతో పాటు తర్వాతి కాలంలో వ్యాపారాలపై దృష్టి సారించడంతో సచిన్ జోషి ప్రేక్షకులకు దూరమయ్యారు. అయితే 2020 మార్చిలో హైదరాబాద్ పోలీసులు భారీగా గుట్కాను సీజ్ చేశారు. విచారణలో భాగంగా పట్టుబడ్డ వారిని పోలీసులు ప్రశ్నించగా.. సచిన్ జోషి పేరు బయటకు వచ్చింది. దీంతో ఆయనపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ క్రమంలో దుబాయ్ నుంచి భారత్‌కు వస్తుండగా ముంబై విమానాశ్రయంలో సచిన్‌ను అరెస్ట్ చేశారు.
డ్రగ్స్, మనీలాండరింగ్ కేసుల్లో సచిన్ జోషి పేరు:
ఈ కేసే కాకుండా.. ముంబైకి చెందిన ఓంకార్ రియల్టీ గ్రూప్‌కు చెందిన మనీల్యాండరింగ్ కేసులో సచిన్ జోషి పేరు బయటకు వచ్చింది. దీంతో ఆయనను ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆర్ధిక మోసగాడు, రుణ ఎగవేతదారుడు అయిన విజయ్ మాల్యా బంగ్లాను ఏరి కోరి కొనడంతో సచిన్ చిక్కుల్లో పడ్డారు. గోవాలోని కింగ్ ఫిషర్ విల్లాను 2017లో రూ.73 కోట్లకు పైగా వెచ్చించి కొనుగోలు చేశాడు. దీనికి సంబంధించి సచిన్ ప్రమోటర్‌గా వున్న జేఎంజే గ్రూప్, ఓంకార్ రియాల్టీ మధ్య ప్రశ్నార్ధకమైన లావాదేవీలు వున్నట్లు ఈడీ ఆరోపించింది. ఈ కేసుకు సంబంధించి సచిన్ ఇల్లు, వ్యాపార కార్యాలయాలు, జేఎంజే గ్రూప్ ఆఫీస్‌లోనూ ఈడీ సోదాలు నిర్వహించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout