Sachin Joshi : దావూద్ ఇబ్రహీంతో లింకులు.. 'మౌనమేలనోయి' హీరో సచిన్ జోషి తండ్రికి పదేళ్ల జైలు

  • IndiaGlitz, [Tuesday,January 10 2023]

సినీనటుడు సచిన్ జోషి (Sachin Joshi)తండ్రి జేఎం జోషికి న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష విధించింది. పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఓ గుట్కా యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి జేఎం జోషి , మరో ఇద్దరు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సాయం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. గుట్కా ఉత్పత్తిదారుడుగా వున్న జేఎం జోషి, అతని ప్రత్యర్ధి రసిక్‌లాల్ ధారివాల్‌కు మధ్య 2002లో వివాదం తలెత్తగా జోషి దీని పరిష్కారానికి ఇబ్రహీంను ఆశ్రయించారు. దీనిని పరిష్కరించినందుకు ప్రతిఫలంగా జోషి.. పాకిస్తాన్‌లో ఆశ్రయం పొందుతున్న దావూద్ ఇబ్రహీం కోసం ఓ గుట్కా యూనిట్‌ను ఏర్పాటు చేశాడు.

మౌనమేలనోయి సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ:

ఇకపోతే.. 2002లో మౌనమేలనోయి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు సచినో జోషి (Hero Sachin Joshi). తర్వాత ఒరేయ్ పండు, నిను చూడక నేనుండలేను, జాక్‌పాట్, నీ జతగా నేనుండాలి లాంటి సినిమాలు చేశాడు. వీటిలో చెప్పుకోదగ్గ విజయాలు లేకపోవడంతో పాటు తర్వాతి కాలంలో వ్యాపారాలపై దృష్టి సారించడంతో సచిన్ జోషి ప్రేక్షకులకు దూరమయ్యారు. అయితే 2020 మార్చిలో హైదరాబాద్ పోలీసులు భారీగా గుట్కాను సీజ్ చేశారు. విచారణలో భాగంగా పట్టుబడ్డ వారిని పోలీసులు ప్రశ్నించగా.. సచిన్ జోషి పేరు బయటకు వచ్చింది. దీంతో ఆయనపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ క్రమంలో దుబాయ్ నుంచి భారత్‌కు వస్తుండగా ముంబై విమానాశ్రయంలో సచిన్‌ను అరెస్ట్ చేశారు.

డ్రగ్స్, మనీలాండరింగ్ కేసుల్లో సచిన్ జోషి పేరు:

ఈ కేసే కాకుండా.. ముంబైకి చెందిన ఓంకార్ రియల్టీ గ్రూప్‌కు చెందిన మనీల్యాండరింగ్ కేసులో సచిన్ జోషి పేరు బయటకు వచ్చింది. దీంతో ఆయనను ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆర్ధిక మోసగాడు, రుణ ఎగవేతదారుడు అయిన విజయ్ మాల్యా బంగ్లాను ఏరి కోరి కొనడంతో సచిన్ చిక్కుల్లో పడ్డారు. గోవాలోని కింగ్ ఫిషర్ విల్లాను 2017లో రూ.73 కోట్లకు పైగా వెచ్చించి కొనుగోలు చేశాడు. దీనికి సంబంధించి సచిన్ ప్రమోటర్‌గా వున్న జేఎంజే గ్రూప్, ఓంకార్ రియాల్టీ మధ్య ప్రశ్నార్ధకమైన లావాదేవీలు వున్నట్లు ఈడీ ఆరోపించింది. ఈ కేసుకు సంబంధించి సచిన్ ఇల్లు, వ్యాపార కార్యాలయాలు, జేఎంజే గ్రూప్ ఆఫీస్‌లోనూ ఈడీ సోదాలు నిర్వహించింది.

More News

Samantha : చేతిలో జపమాలతో కొత్తగా సమంత..మునుపటి ఛార్మింగ్ లేదన్న నెటిజన్ , కౌంటరిచ్చిన సామ్

హీరోయిన్‌గా తొలి నుంచి వున్న ఫేమ్‌కి తోడు, నాగచైతన్యకి విడాకులు, ఇటీవల అనారోగ్యం బారినపడటంతో సమంత (Samantha) ఏం చేసినా..

Chiranjeevi:వాల్తేర్ వీరయ్యకు శృతీహాసన్ గైర్హాజరు.. ఎవరైనా బెదిరించారేమో : చిరు సంచలన వ్యాఖ్యలు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం విశాఖలో జరిగింది.

Heart Attack : అప్పటిదాకా ఆటపాటలతో సందడి, అంతలోనే విషాదం.. గుండెపోటుతో 12 ఏళ్ల చిన్నారి మృతి

గుండెపోటు.. గతంలో 50 పైబడిన వారిలో మాత్రమే కనిపించే ఈ వ్యాధి ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా భయపెడుతోంది.

Butta Bomma:'బుట్ట బొమ్మ' చిత్రంలోని 'పేరు లేని ఊరులోకి' పాట విడుదల

అనిక సురేంద్రన్, సూర్య వశిష్ట,అర్జున్ దాస్ నటిస్తున్న 'బుట్ట బొమ్మ' చిత్రం నుండి మొదటి పాట 'పేరు లేని ఊరులోకి' విడుదల

G2: అడివి శేష్ G2 ఫస్ట్ లుక్ , ప్రీ-విజన్ విడుదల

HIT-2తో డబుల్ హ్యాట్రిక్ హిట్‌ లను పూర్తి చేసిన ప్రామిసింగ్ యంగ్ హీరో అడివి శేష్ ఇటీవలే తన తదుపరి ప్రాజెక్ట్‌ గా గూఢచారి