నా హృద‌యానికి ద‌గ్గ‌రైన సినిమా 'ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ' - హీరో రామ్‌

  • IndiaGlitz, [Saturday,October 14 2017]

ఎన‌ర్జిటిక్ రామ్‌ హీరోగా అనుపమ పరమేశ్వరన్‌, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'ఉన్నది ఒకటే జిందగీ'. స్రవంతి రవికిషోర్‌, పీఆర్‌ సినిమాస్‌ సమర్పణలో స్రవంతి సినిమాటిక్స్‌ పతాకంపై కృష్ణ చైతన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 27న చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్బంగా

హీరో రామ్‌ మాట్లాడుతూ - ''సినిమా నా హృదయానికి చాలా చాలా దగ్గరైన సినిమా 'ఉన్నది ఒక్కటే జిందగీస‌. ఈ సినిమాకు డైరెక్ట‌ర్ కిషోర్ తిరుమ‌ల‌, పెద్ద‌నాన్న స్ర‌వంతి ర‌వికిషోర్‌గారు, స‌మీర్‌, దేవిశ్రీ ప్ర‌సాద్ నాలుగు స్తంభాల్లా నిలిచారు. ముందు దేవిశ్రీ గురించి చెప్పాలంటే త‌న‌తో ప‌నిచేయ‌డం చాలా తేలిక‌. త‌న చాలా బాగా ప‌ని చేస్తాడు. త‌న ప‌నితో మ‌న‌ల్ని మాట్లాడ‌నీయ‌నంత బాగా చేస్తాడు. స‌మీర్‌గారు స‌న్నివేశాన్ని ఫీల్ అయ్యి చేస్తారు. అందుకే ఆయ‌న‌తో అనుబంధం కొన‌సాగుతుంది. ఇక నేను సినిమాల్లోకి ప్యాష‌న్‌తో వ‌చ్చినా, పెద్ద‌నాన్న‌గారిని చూశాక‌, నాకు ప్యాష‌న్ అంటే అర్థ‌మేంటో తెలిసింది. ఇక కిషోర్‌గారి గురించి నేను పొగ‌డలేను. ఈ సినిమా చేయ‌డం వ‌ల్ల ..అస‌లు ఇండ‌స్ట్రీలో ఎందుకు వ‌చ్చామనే విష‌యం నాకు అర్థ‌మైంది క్టోబర్‌ 27న సినిమా విడుదలవుతుంది. తప్పకుండా అందరినీ సినిమా మెప్పిస్తుంది'' అన్నారు.

కిషోర్‌ తిరుమల మాట్లాడుతూ - ''రవికిషోర్‌గారి ఆలోచనలు, నా ఆలోచనలు ఒకేలా ఉంటాయి. రవికిషోర్‌గారు నాపై పెట్టుకున్న నమ్మకం 'నేను శైలజ' సినిమా అయితే..ఆయన నాపై పెట్టుకున్న గట్టి నమ్మకం ఈ 'ఉన్నది ఒక్కటే జిందగీ'. నాపై నమ్మకం ఉంచినందుకు రవికిషోర్‌గారికి థాంక్స్‌. నిర్మాతగా కృష్ణచైతన్య చేస్తున్న తొలి సినిమా ఇది. తప్పకుండా పెద్ద హిట్‌ అవుతుంది. రీరికార్డింగ్‌తో సినిమా చూశాను. సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. అనుపమ పరమేశ్వరన్‌ మహా అనే క్యారెక్టర్‌లో అద్భుతంగా నటించింది. అలాగే లావణ్య, అనీషా చాలా చక్కటి రోల్స్‌ చేశారు. శ్రీవిష్ణును ఈ సినిమాతో వాసు అని పిలుస్తారు. అంతలా తను ఈ క్యారెక్టర్‌లో ఒదిగిపోయారు'' అన్నారు.

స్రవంతి రవికిషోర్‌ మాట్లాడుతూ - ''దర్శకుడు కిషోర్‌ సినిమా కోసం ఏదీ చేసినా తన గుండె లోతుల నుండే చేస్తాడు. దేవిశ్రీ లేకుండా ఈ సినిమా వీలైయ్యేది కాదు. వండర్‌ఫుల్‌ మ్యూజిక్‌ అందించాడు'' అన్నారు.

నిర్మాత కృష్ణ చైతన్య మాట్లాడుతూ - ''దేవిశ్రీ ప్రసాద్‌, సమీర్‌గారు సహా టీం అందరికీ థాంక్స్‌, ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

దేవిశ్రీ ప్రసాద్‌ మాట్లాడుతూ - ''కిషోర్‌గారితో పనిచేయడం ఎప్పటికీ ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుంది. ఆయనతో 'నేను శైలజ' సినిమాకు పనిచేశాను. ఆయన డైలాగ్స్‌లో డిఫరెంట్‌ సెన్సాఫ్‌ హ్యుమర్‌ ఉంటుంది. అనుపమకు చాలా మంచి పేరు వచ్చింది. లావణ్య, అనీషా బాగా నటించారు. వాసు క్యారెక్టర్‌లో శ్రీవిష్ణు సూపర్బ్‌గా చేశాడు. హీరోకు సమానంగా సాగే పాత్ర ఇది. ఈ సినిమా బెస్ట్‌ ఫ్రెండ్స్‌, ఫ్రెండ్‌షిప్‌ కోసం డేడికేషన్‌ చేసేలా సినిమా ఉంటుంది. స్రవంతి మూవీస్‌లో పనిచేయడాన్ని ఎప్పుడూ ఎంజాయ్‌ చేస్తాను. ఎందుకంటే ఆయన బ్యానర్‌లో పనిచేసే నటీనటులు, టెక్నిషియన్స్‌ను గౌరవించే నిర్మాతల్లో ఆయన ఒకరు. చంద్రబోస్‌గారు, శ్రీమణి మంచి సాహిత్యాన్ని అందించారు. వీరిద్దరికీ థాంక్స్‌'' అన్నారు.