రష్యా- ఉక్రెయిన్ వార్: భారతీయుల ఇబ్బందులపై హీరో రామ్ పోతినేని ఎమోషనల్ ట్వీట్
Send us your feedback to audioarticles@vaarta.com
ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో ప్రస్తుతం అక్కడికి వెళ్లిన భారతీయ విద్యార్ధులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. యుద్ధం మొదలవ్వడానికి ముందే ఉక్రెయిన్ నుంచి ప్రత్యేక విమానాలతో విద్యార్ధుల తరలింపు కార్యక్రమం మొదలుపెట్టింది భారత ప్రభుత్వం. అయితే గగనతలాన్ని మూసివేయడంతో ఉక్రెయిన్ నుంచి విద్యార్ధుల తరలింపు కష్టంగా మారింది. దీంతో ఆ దేశ పశ్చిమ సరిహద్దుల వైపుకు చేరుకుంటే.. అక్కడి నుంచి విద్యార్ధులను రొమేనియా, హంగేరి మీదుగా భారత్‌కు తరలిస్తున్నారు అధికారులు.
ఈ క్రమంలోనే నిన్న రష్యా దాడుల్లో భారతీయ విద్యార్ధి మరణించడంతో యావత్ దేశం ఉలిక్కిపడింది. ఈ ఘటనతో అక్కడ వున్న మన పౌరులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన అత్యున్నత స్థాయి భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాబోయే మూడు రోజుల్లో 26 విమానాలను ఉక్రెయిన్‌కు పంపాలని నిర్ణయించారు.
మరోవైపు భారతీయ విద్యార్ధులను క్షేమంగా స్వదేశానికి తీసుకురావాలంటూ పలువురు ప్రముఖులు కేంద్రాన్ని కోరుతున్నారు. వీరిలో హీరో రామ్ కూడా వున్నారు. బుధవారం ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘యుద్ధంలో పోరాడేందుకు ఇతర దేశాలు నేరుగా తమ సైన్యాన్ని పంపడం సరైన చర్య కాకపోవచ్చు. కానీ, తమ పౌరులను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చేందుకు సరైన విధంగా తమ డ్యూటీ నిర్వర్తించాల్సింది’ అంటూ రామ్ ట్వీట్ చేశాడు. ఉక్రెయిన్ - రష్యా వార్ త్వరగా ముగియాలని, ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులు క్షేమంగా ఉండాలని ఆయన ఆకాంక్షించాడు. బాధితుల కోసం ప్రార్థించాలని కోరారు.
ఇకపోతే.. సినిమా విషయానికి వస్తే.. రామ్ పోతినేని తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ‘ది వారియర్’ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి నటిస్తుండగా.. ఆది పినిశెట్టి కీలకపాత్ర పోషిస్తున్నారు. అలాగే బోయపాటి శ్రీను దర్శకత్వంలోనూ రామ్ ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
It may not be the right move for the other countries to directly send in their troops to fight the war..but, it’s their Bloody God Damn DUTY to put some boots on the ground to get their respective citizens back safely! #UkraineWar #SaveIndiansInUkraine
— RAm POthineni (@ramsayz) March 2, 2022
Strength & Prayers#RAPO
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout