రష్యా- ఉక్రెయిన్ వార్: భారతీయుల ఇబ్బందులపై హీరో రామ్ పోతినేని ఎమోషనల్ ట్వీట్

  • IndiaGlitz, [Wednesday,March 02 2022]

ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో ప్రస్తుతం అక్కడికి వెళ్లిన భారతీయ విద్యార్ధులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. యుద్ధం మొదలవ్వడానికి ముందే ఉక్రెయిన్ నుంచి ప్రత్యేక విమానాలతో విద్యార్ధుల తరలింపు కార్యక్రమం మొదలుపెట్టింది భారత ప్రభుత్వం. అయితే గగనతలాన్ని మూసివేయడంతో ఉక్రెయిన్ నుంచి విద్యార్ధుల తరలింపు కష్టంగా మారింది. దీంతో ఆ దేశ పశ్చిమ సరిహద్దుల వైపుకు చేరుకుంటే.. అక్కడి నుంచి విద్యార్ధులను రొమేనియా, హంగేరి మీదుగా భారత్‌కు తరలిస్తున్నారు అధికారులు.

ఈ క్రమంలోనే నిన్న రష్యా దాడుల్లో భారతీయ విద్యార్ధి మరణించడంతో యావత్ దేశం ఉలిక్కిపడింది. ఈ ఘటనతో అక్కడ వున్న మన పౌరులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన అత్యున్నత స్థాయి భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాబోయే మూడు రోజుల్లో 26 విమానాలను ఉక్రెయిన్‌కు పంపాలని నిర్ణయించారు.

మరోవైపు భారతీయ విద్యార్ధులను క్షేమంగా స్వదేశానికి తీసుకురావాలంటూ పలువురు ప్రముఖులు కేంద్రాన్ని కోరుతున్నారు. వీరిలో హీరో రామ్ కూడా వున్నారు. బుధవారం ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘యుద్ధంలో పోరాడేందుకు ఇతర దేశాలు నేరుగా తమ సైన్యాన్ని పంపడం సరైన చర్య కాకపోవచ్చు. కానీ, తమ పౌరులను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చేందుకు సరైన విధంగా తమ డ్యూటీ నిర్వర్తించాల్సింది’ అంటూ రామ్ ట్వీట్ చేశాడు. ఉక్రెయిన్ - రష్యా వార్ త్వరగా ముగియాలని, ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులు క్షేమంగా ఉండాలని ఆయన ఆకాంక్షించాడు. బాధితుల కోసం ప్రార్థించాలని కోరారు.

ఇకపోతే.. సినిమా విషయానికి వస్తే.. రామ్ పోతినేని తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ‘ది వారియర్’ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి నటిస్తుండగా.. ఆది పినిశెట్టి కీలకపాత్ర పోషిస్తున్నారు. అలాగే బోయపాటి శ్రీను దర్శకత్వంలోనూ రామ్ ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

More News

టీడీపీ పెద్దాయనకు అశ్రు నివాళి.. యడ్లపాటి పాడె మోసిన చంద్రబాబు

టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంక్రటావు అంత్యక్రియలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు.

మా వాడి జాతకానికి ముహూర్తం కుదరడం లేదు .. ‘‘అశోకవనంలో అర్జున కల్యాణం’’ వాయిదా

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ సినిమాల విషయంలో దూకుడు పెంచారు. 'వెళ్లిపోమాకే', 'ఈ నగరానికి ఏమైంది',

పెండింగ్ చలాన్ల క్లియరెన్స్: పోటెత్తిన జనం.. సర్వర్ క్రాష్, తొలి రోజు ఎన్ని కోట్ల ఆదాయమంటే..?

ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చ‌లాన్ల క్లియ‌రెన్స్ ప్రక్రియకు తెలంగాణ పోలీసులు మంగళవారం నుంచి శ్రీకారం చుట్టారు.

‘‘నా ధైర్యం అణువణువునా వుంటుంది’’: రామారావు ఆన్ డ్యూటీ టీజర్ రిలీజ్.. తాటతీస్తున్నాడుగా.. !!!

మాస్ మహారాజ్ రవితేజ వరుస సినిమాలతో బిజీగా వున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఖిలాడీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ఆయన..

పునీత్ రాజ్‌కుమార్ ‘జేమ్స్’ ట్రేడ్‌మార్క్ సాంగ్‌కు ట్రెమండస్ రెస్పాన్స్

కన్నడ ప్రేక్షకుల ఆరాధ్య దైవం దివంగత హీరో పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’.