మాస్ స్టామినా ఇది.. కళ్ళు చెదిరే రికార్డ్ రామ్ సొంతం!
Send us your feedback to audioarticles@vaarta.com
యువ హీరోల్లో రామ్ స్పెషల్ స్కిల్స్ ఉన్న నటుడు. డాన్సులు, నటన, ఫైట్స్ ఇలా ఏదైనా అదరగొట్టేస్తాడు. అందుకే రామ్ ని అభిమానులు ఎనెర్జిటిక్ హీరో అని పిలుచుకుంటారు. 2019లో పూరి జగన్నాధ్ దర్శత్వంలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్ చిత్రం రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
ఈ చిత్రం తాజాగా యూట్యూబ్ లో అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. ఇస్మార్ట్ శంకర్ మూవీని గత ఏడాది హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. తాజాగా ఈ చిత్రం యూట్యూబ్ లో 200 మిలియన్ల వ్యూస్ తో రికార్డ్ సొంతం చేసుకుంది. నార్త్ లో తెలుగు సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. అందులోనూ ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో మాస్ మసాలా అంశాలు మెండుగా ఉండడంతో హిందీ ఆడియన్స్ ఈ చిత్రాన్ని తెగ చూసేస్తున్నారు.
ఇదీ చదవండి: పవన్, అకీరా ఇద్దరూ కలసి.. ఫోటోస్ వైరల్
పూరి టేకింగ్, రామ్ ఎనర్జీ, నాభా నటేష్, నిధి అగర్వాల్ గ్లామర్, మణిశర్మ సంగీతం ఈ చిత్ర విజయానికి కారణం అయ్యాయి. వరుస ఫ్లాపుల్లో ఉన్న రామ్ కు ఈ చిత్రం మంచి జోష్ అందించింది. ప్రస్తుతం రామ్ తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శత్వంలో ఓ చిత్రం చేయబోతున్నాడు.
ఇక పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండతో లైగర్ అనే మూవీ తెరకెక్కిస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com