ఆర్ఆర్ఆర్ రిలీజ్ కాకపోయినా మాకేం బాధలేదు.. కానీ : రామ్‌చరణ్ హాట్ కామెంట్స్
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి సిరీస్ తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘‘ఆర్ఆర్ఆర్’’. జూనియర్ ఎన్టీఆర్- రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 7న ఆర్ఆర్ఆర్ రావాల్సింది. కానీ దేశంలో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతుండటం.. అనేక రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు, 50 శాతం ఆక్యూపెన్సీతో థియేటర్లు నడపాలని ప్రభుత్వాలు హుకుం జారీ చేయడం ఆర్ఆర్ఆర్ సినిమాను సంక్రాంతి రేసు నుంచి వెనక్కి లాగాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా కావడంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల శ్రేయస్సును దృష్టిలో వుంచుకుని ప్రస్తుత పరిస్ధితుల్లో ఆర్ఆర్ఆర్‌ను రిలీజ్ చేయలేమని చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో మెగా- నందమూరి అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ వాయిదాపై స్పందించారు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్. స్టార్ ప్రొడ్యూసర్ శిరీష్ తనయుడు ఆశిష్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘రౌడీబాయ్స్’. హర్ష కొనుగంటి దర్శకుడు. దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ‘మ్యూజికల్’ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సంక్రాంతికి ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కాకపోయినా తమకు బాధ లేదన్నారు. ఆ సినిమా సరైన సమయంలో రావాలని.. దాని కోసం దాదాపు నాలుగేళ్లు కష్టపడ్డామని రామ్ చరణ్ అన్నారు. ఆర్ఆర్ఆర్ విడుదల ఎప్పుడు అనేది రాజమౌళి, దానయ్య నిర్ణయిస్తారని ఆయన స్పష్టం చేశారు. సంక్రాంతి మాకేంత ముఖ్యమో తెలియదు గానీ దిల్ రాజుకి చాలా ముఖ్యం అని రామ్‌చరణ్ అన్నారు.
ఇక ‘‘ఆర్ఆర్ఆర్’’లో రామ్‌చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఓలివియా మోరిస్ కనిపించనున్నారు. శ్రియా శరన్, అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని తదితరులు కీలక పాత్ర పోషించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com