ఇంటర్ స్టూడెంట్స్‌కు.. ఇంటర్ ఫెయిలైన రామ్ సలహా!

  • IndiaGlitz, [Tuesday,April 23 2019]

తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ ఫలితాల అనంతరం ఫెయిలైన.. మార్కులు సరిగ్గా రాలేదని తీవ్ర మనస్తాపానికి గురైన పలువురు విద్యార్థులు తనువు చాలించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఇప్పటి వరకూ 15 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఇంటర్ బోర్డు చేసిన తప్పిదాలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటన్నింటినీ చూసిన టాలీవుడ్ సెలబ్రిటీలు చలించిపోయారు. సోషల్ మీడియా వేదికగా నటీనటులు, డైరెక్టర్స్‌తో పాటు పలువురు ప్రముఖులు స్పందిస్తూ విద్యార్థులకు పలు సూచనలు, సలహాలిచ్చారు. తాజాగా హీరో రామ్ స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా స్పందించాడు.

రామ్ ట్వీట్ సారాంశం..

ఇంటర్ ఫలితాలే జీవితం అనుకునే నా తమ్ముళ్లకి, చెల్లెళ్లకి.. మీరు జీవితంలో అవ్వబోయే దానికి.. చేయబోయేదానికి ఇది ఒక------తో సమానం. దయచేసి లైట్ తీసుకోండి. ఇట్లు ఇంటర్ కూడా పూర్తి చేయని మీ రామ్ పోతినేని అని ఆయన ట్వీట్ చేశాడు. అయితే రామ్ ట్వీట్‌పై పెద్ద ఎత్తున నెటిజన్లు, అభిమానులు కన్నెర్రజేస్తున్నారు.

రామ్‌పై ఆగ్రహం..

ఎంత సెలబ్రిటీ అయితే మాత్రం ------తో సమానం అని అంటారా..? ఒక సెలబ్రిటీ అయ్యుండి మీరు అనాల్సిన, వాడాల్సిన పదమేనా..? మీకు ఇంకేం పదాలు దొరకలేదా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ లాంగ్వేజ్ ఏంటి..? పూరీ జగన్నాథ్ మిమ్మల్ని మార్చేశారా ఏంటి..? పూరీకి బాగా కనెక్ట్ అయినట్లున్నారే..? అని నెటిజన్లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. అయితే కొందరు మాత్రం.. ఎస్ ఇలా చెబితే పిల్లలు వింటారు.. తిన్నగా కూర్చోబెట్టి చెబితే అస్సలు వినే రోజులు కావు.. వాళ్లు వినే పరిస్థితులో లేరు అంటూ కొందరు రామ్‌ను మెచ్చుకుంటున్నారు.

INTER RESULTS ey jeevitham anukuney na thammullaki, chellillaki..meeru jeevitham lo avvaboyedhaniki..cheyaboyedhaniki, idhi oka aa*** tho samanam...dayachesi lite thesukondi..

Itlu,
Inter kuda poorthicheyani me..
-R.A.P.O#InterBoardMurders

— RAm POthineni (@ramsayz) April 23, 2019

More News

లంకలో బాంబులు పేల్చింది వీడే.. 

శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన వరుస బాంబు పేలుళ్లు వందలాది కుటుంబాలకు శోకాన్ని మిగిల్చాయి. ఇప్పటి వరకూ 321 మంది ప్రజలు మరణించగా.. 500 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

'సూర్య‌వంశీ' తో క‌త్రినా

బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి సినిమాలు మాస్ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటాయి. ఆయన రూపొందించే సినిమాలన్నీ మాస్ మసాలాతో పక్కా కమ‌ర్షియల్‌గా ఉంటాయి.

యువతి దుస్తులు తీయమన్న వినయ్ వర్మ అరెస్ట్!

'సూత్రధార్' యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ వినయ్‌వర్మ.. నటన నేర్చుకోవాలంటే బట్టలు విప్పేయాలంటూ యువతులను వేధించిన సంగతి తెలిసిందే.

సూర్య‌, శివ‌.. అఫీషియ‌ల్‌

హీరో అజిత్‌తో వరసగా నాలుగు సినిమాలు చేసి, నాలుగు సినిమాలనూ సూపర్‌హిట్ చేసిన ఘనత దర్శకుడు శివకు దక్కుతుంది.

జగన్‌పై హత్యాయత్నం కేసు: తీవ్ర విషమంగా నిందితుడి ఆరోగ్యం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి హత్యాయత్నం కేసులో శ్రీనివాస్ అనే యువకుడు కీలక నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే.