పెద్ద మనసు చాటుకున్న ప్రభాస్.. అభిమాని కుటుంబానికి ఆర్ధిక సాయం

  • IndiaGlitz, [Tuesday,March 15 2022]

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన పెద్ద మనసు చాటుకున్నారు. ప్రమాదవశాత్తూ మరణించిన తన అభిమాని కుటుంబాన్ని ఆదుకున్నారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా కారంపూడికి చెందిన చల్లా పెదకోటి ప్రభాస్ వీరాభిమాని. తన అభిమాన నటుడు నటించిన ‘‘రాధేశ్యామ్’’ రిలీజ్‌ను పురస్కరించుకుని ఈ నెల 10న స్థానిక సినిమా థియేటర్ వద్ద బ్యానర్ కడుతున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని మండల అిమాన సంఘం నాయకుడు చల్లా అనిల్ ... ప్రభాస్ దృష్టికి తీసుకెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. అంతేకాదు.. అనిల్ ద్వారా రూ.2 లక్షల ఆర్ధిక సాయాన్ని మృతుడు పెదకోటి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా పెదకోటి భార్య, తల్లిదండ్రులు.. ప్రభాస్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.

కాగా.. రాధేశ్యామ్ సినిమాకు మిక్స్‌డ్ టాక్ రావటాన్ని తట్టుకోలేక కర్నూలు జిల్లాకు చెందిన ఓ అభిమాని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. రవితేజ అనే అభిమాని రాధేశ్యామ్ చూసి వచ్చాడు. అయితే సినిమా అనుకున్న స్థాయిలో లేకపోవడం.. మిక్స్‌డ్ టాక్ రావటంతో తట్టుకోలేకపోయాడు. దీంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ వరుస ఘటనల నేపథ్యంలో ప్రభాస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

More News

ఆనంద్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా `హైవే` మూవీ కొత్త పోస్టర్ విడుదల

యంగ్ స్టార్ ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా `హైవే`. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కేవీ గుహ‌న్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న ఈ సైకో క్రైమ్‌ థ్రిల్లర్ చిత్రంలో

హీరో ఆనంద్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా  'బేబీ' సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్

ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా 'బేబీ'.  ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్ కే ఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

జగన్‌తో రాజమౌళి, డీవీవీ దానయ్య భేటీ: టాలీవుడ్ అటెన్షన్, ఈ కలయిక ‘ఆర్ఆర్ఆర్’ కోసమేనా..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ప్రముఖ దర్శకుడు రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య కలిశారు.

అసెంబ్లీని కుదిపేసిన జంగారెడ్డి గూడెం ఘటన.. ఐదుగురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సభ నుంచి సస్పెండ్ చేశారు.

కేంద్రం కీలక నిర్ణయం.. 12-14 ఏళ్ల వయసు వారికీ కరోనా వ్యాక్సిన్, ఆ రోజు నుంచే

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు భారత్ మరింత పకడ్బందీ చర్యలు చేపడుతోంది. ఇప్పటికే దేశ ప్రజలకు రెండు డోసుల వ్యాక్సిన్‌ను అందజేసిన కేంద్రం..