పెద్ద మనసు చాటుకున్న ప్రభాస్.. అభిమాని కుటుంబానికి ఆర్ధిక సాయం
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన పెద్ద మనసు చాటుకున్నారు. ప్రమాదవశాత్తూ మరణించిన తన అభిమాని కుటుంబాన్ని ఆదుకున్నారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా కారంపూడికి చెందిన చల్లా పెదకోటి ప్రభాస్ వీరాభిమాని. తన అభిమాన నటుడు నటించిన ‘‘రాధేశ్యామ్’’ రిలీజ్‌ను పురస్కరించుకుని ఈ నెల 10న స్థానిక సినిమా థియేటర్ వద్ద బ్యానర్ కడుతున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని మండల అిమాన సంఘం నాయకుడు చల్లా అనిల్ ... ప్రభాస్ దృష్టికి తీసుకెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. అంతేకాదు.. అనిల్ ద్వారా రూ.2 లక్షల ఆర్ధిక సాయాన్ని మృతుడు పెదకోటి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా పెదకోటి భార్య, తల్లిదండ్రులు.. ప్రభాస్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.
కాగా.. రాధేశ్యామ్ సినిమాకు మిక్స్‌డ్ టాక్ రావటాన్ని తట్టుకోలేక కర్నూలు జిల్లాకు చెందిన ఓ అభిమాని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. రవితేజ అనే అభిమాని రాధేశ్యామ్ చూసి వచ్చాడు. అయితే సినిమా అనుకున్న స్థాయిలో లేకపోవడం.. మిక్స్‌డ్ టాక్ రావటంతో తట్టుకోలేకపోయాడు. దీంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ వరుస ఘటనల నేపథ్యంలో ప్రభాస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com