Nikhil: తండ్రి అయిన హీరో నిఖిల్.. నెటిజన్లు శుభాకాంక్షలు..
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్ధార్థ తండ్రయ్యారు. ఆయన భార్య డాక్టర్ పల్లవి వర్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా తన కుమారుడిని ముద్దాడుతున్న ఫొటోను సోషల్ మీడియాలో నిఖిల్ పంచుకున్నారు. తల్లీబిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ‘మా ప్రేమకు గుర్తుగా బేబీని మా జీవితాల్లోకి ఆహ్వానిస్తున్నాం. ఇది వేడుకలు చేసుకోవాల్సిన సమయం’ అని తెలిపారు. దీంతో సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా 2020లో డాక్టర్ పల్లవిని నిఖిల్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల భార్య సీమంతం ఫొటోలు అభిమానులతో పంచుకున్నారు.
ఇక నిఖిల్ సినిమాల విషయానికొస్తే ఏకంగా మూడు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం స్వయంభు, ది ఇండియా హౌస్, కార్తికేయ 3 ప్రాజెక్టులు నిఖిల్ చేతిలో ఉన్నాయి. పీరియాడిక్ చిత్రంగా 'స్వయంభు' తెరకెక్కుతుంది. ఇందుకోసం పొడవాటి జుట్టు పెంచుకుని పూర్తిగా మేకోవర్ అయ్యారు. సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన పోసర్లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. అలాగే మెగా పవర్ స్టార్ రామ్చరణ్ నిర్మిస్తున్న 'ది ఇండియా హౌస్' చిత్రంలోనూ హీరోగా నటిస్తున్నారు.
అలాగే 'కార్తికేయ2' సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టి దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. నిఖిల్ కెరీర్లో 'కార్తికేయ' సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆ సినిమాతోనే నిఖిల్ మంచి క్రేజ్ వచ్చింది. తన స్నేహితుడు చందు మొండేటి దర్శకత్వంలో చేసిన ఆ సినిమా కమర్షియల్గా విజయం సాధించింది. ఆ తర్వాత దీని సీక్వెల్గా వచ్చిన 'కార్తికేయ 2' అయితే పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించింది. ఉత్తరాది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని వసూళ్ల వర్షం కురిపించింది. దీంతో త్వరలోనే 'కార్తికేయ 3'ను కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments