హీరో నిఖిల్ పెళ్లి...

  • IndiaGlitz, [Tuesday,August 08 2017]

తెలుగు చిత్ర‌సీమ‌లో యంగ్ బ్యాచిల‌ర్స్ గ్రూపులో ఒక‌రైన హీరో నిఖిల్ త్వ‌ర‌లోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. త‌న ద‌గ్గ‌రి బంధువు తేజ‌స్విని నిఖిల్ విహ‌హం చేసుకుంటాడ‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మ‌చారం. తేజ‌స్విని ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త అంజ‌నేయులు యాద‌వ్ కుమార్తె అని కూడా న్యూస్ విన‌ప‌డుతుంది.

ఈ ఆగ‌స్ట్ 24న నిశ్చితార్థం, అక్టోబ‌ర్‌లో పెళ్లి చేయ‌బోతున్న‌ట్టు పెద్ద‌లు నిర్ణ‌యించార‌ట‌. హ్యాపీడేస్ చిత్రంతో హీరోగా ప‌రిచ‌యమైన నిఖిల్ త‌ర్వాత వ‌రుస అప‌జ‌యాల‌ను మూట‌గ‌ట్టుకున్నాడు. స్వామిరారా, కార్తికేయ చిత్రాల నుండి నిఖిల్ మ‌ళ్లీ స‌క్సెస్‌ఫుల్ హీరోగా రాణిస్తున్నాడు. ప్ర‌స్తుతం నిఖిల్ ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌లో శ‌ర‌ణ్ కొప్పిశెట్టి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.