Navadeep:నా వల్ల ఏ హీరోయిన్ చనిపోలేదు.. నేను గేని కాను, ఆ రేవ్ పార్టీ జరిగినప్పుడు : నవదీప్ సంచలన వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమా అంటే రంగుల ప్రపంచం. ఇక్కడ నిలదొక్కుకోవాలంటే గుమ్మడికాయంత టాలెంట్‌తో పాటు ఆవ గింజంత అదృష్టం కూడా వుండాలి. ఎంతో ప్రతిభ వున్న ఎందరో నటీనటులు , సాంకేతిక నిపుణులు ఇప్పటికీ అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీరిలో కొందరికి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్, డబ్బు, పరపతి అన్ని వుంటాయి. కానీ అదృష్టం కలిసి రాకపోవడంతో వారు ఎదగలేకపోతున్నారు. ఇలాంటి వారిలో ‘నవదీప్’ ఒకరు. ఒడ్డూ పొడుగు, మంచి పర్సనాలిటీ ఇలా హీరోకి వున్న అన్ని క్వాలిటీస్ వున్నప్పటికీ నవదీప్ కథానాయకుడిగా సక్సెస్ కాలేకపోయారు. తొలుత హీరోగా కొన్ని సినిమాలు చేయగా.. రిజల్ట్ తేడా కొట్టేయడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారారు. కొన్ని నెగిటివ్ షేడ్స్ వున్న సినిమాలు కూడా చేశారు.
న్యూసెన్స్ వెబ్ సిరీస్‌లో నటిస్తోన్న నవదీప్ :
ప్రస్తుతం ఓటీటీల్లో వెబ్ సిరీస్ ట్రెండ్ నడుస్తూ వుండటంతో .. నవదీప్ ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. దీనిలో భాగంగా ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన న్యూసెన్స్‌లో ఆయన బిందు మాధవితో కలిసి నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించి మే 12న తొలి సీజన్ స్ట్రీమింగ్ కానుంది. దీంతో ప్రమోషన్స్ ముమ్మరంగా చేస్తున్నారు. అయితే నవదీప్‌పై మధ్యమధ్యలో ఎన్నో రూమర్స్ వచ్చాయి. ఈ క్రమంలో న్యూసెన్స్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా వాటన్నింటికి చెక్ పెట్టేందుకు నవదీప్ ప్రయత్నించారు.
రూమర్స్‌కు చెక్ పెట్టిన నవదీప్ :
ఈ సందర్భంగా ఓ విలేకరి.. మీ వల్ల ఓ అమ్మాయి చనిపోయింది..? మీరు గేనా..? రేవ్ పార్టీ నిర్వహించారా అంటూ ప్రశ్నించారు. దీనికి నవదీప్ ఓపెన్‌గా సమాధానం ఇచ్చారు. 2005లో తన వల్ల ఓ హీరోయిన్ చనిపోయిందని ఓ పత్రికలో వార్త వచ్చిందని.. కానీ అది పూర్తిగా అబద్ధమన్నారు. తన వల్ల ఏ హీరోయిన్ చనిపోలేదని.. అంతేకాదు.. తాను గే అనే వార్తలు కూడా అబద్దమన్నారు. అలాగే తాను రేవ్ పార్టీలో పాల్గొన్నట్లుగా కూడా న్యూస్ వచ్చిందని.. కానీ ఇది జరిగిందని చెబుతున్న రోజున తాను మా కుటుంబంతో కలిసి ఫామ్‌హౌస్‌కు వెళ్లానని నవదీప్ తెలిపారు. దీనికి మా అమ్మే సాక్ష్మమని.. ఈ ఘటనతో ఇంట్లో తనపై నమ్మకం పెరిగిందని నవదీప్ చెప్పారు. అంతేకాదు.. నాటి నుంచి ఇలాంటి రూమర్లను పట్టించుకోవడం మానేశానని ఆయన తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com