Navadeep:మాదాపూర్ డ్రగ్స్ కేసు : పరారీలో నవదీప్ , సీపీ ప్రకటన .. ఎక్కడికి పారిపోలేదన్న హీరో
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ యువ హీరో నవదీప్ మరోసారి డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు. ఇటీవల వెలుగుచూసిన మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్‌కు ప్రమేయం వున్నట్లుగా హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. నవదీప్ డ్రగ్స్ సేవించినట్లుగా తమ దర్యాప్తులో తేలిందని.. ప్రస్తుతం ఆయన పరారీలో వున్నాడని సీపీ చెప్పారు. నవదీప్ స్నేహితుడు రాంచంద్‌ను అరెస్ట్ చేశామని.. అతని నుంచి సేకరించిన సమాచారం ప్రకారం నవదీప్‌ను డ్రగ్స్ కస్టమర్‌గా తేల్చామని కమీషనర్ తెలిపారు. అయితే తాను ఎక్కడికి పారిపోలేదని.. హైదరాబాద్‌లోనే వున్నానంటూ నవదీప్ ట్వీట్ చేశారు.
కాగా.. గతంలో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులోనూ నవదీప్ పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను ఎక్సైజ్, ఈడీ అధికారులు విచారించారు. తాజాగా ఇప్పుడు మాదాపూర్ డ్రగ్స్ కేసులోనూ నవదీప్ పేరు వుండటంతో టాలీవుడ్ ఉలిక్కిపడింది. ఈ కేసులో మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేష్‌ను కూడా అరెస్ట్ చేసినట్లు సీవీ ఆనంద్ తెలిపారు.
ఇకపోతే.. మాదాపూర్ డ్రగ్స్ కేసులో మరో ఎనిమిది మందిని నార్కోటిక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు నైజీరియన్లతో పాటు డ్రగ్స్ వాడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ఓ సినీ నిర్మాత వున్నట్లుగా సమాచారం. వీరి వద్ద నుంచి 50 గ్రాముల ఎండీఎంఏ, 8 గ్రాముల కొకైన్, 24 ఎక్టసీ పిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
That's not me gentlemen
— Navdeep (@pnavdeep26) September 14, 2023
I'm right here .. pls clarify thanks
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com