హీరో నాని చేతుల మీదుగా విడుదలకానున్న 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' టీజర్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా డాటర్ నిహారిక డిజటిల్ మీడియాలో సందడి చేస్తున్నారు. సినిమాలు పెద్దగా ఆమెకు కలిసిరాకపోయినా వెబ్ సిరీస్‌లతో మాత్రం ప్రేక్షకులకు చేరువ అవుతున్నారు. పెళ్లి తర్వాత కూడా ఈ అమ్మడి జోరు తగ్గలేదు. సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగానే ఉంది. అయితే రీసెంట్‌గా జీ5 ట్వీట్ చేస్తూ.. మరో అద్భుతమైన అనుభూతి కోసం రెడీగా ఉండండి అని తెలిపింది. ‘ఓసీఎఫ్ఎస్’ అంటే ఏంటో గెస్ చేయగలరా? అని అడిగింది. జీ 5 చేసిన ట్వీట్‌ని రీ ట్వీట్ చేసిన నిహారిక తన తండ్రి బర్త్ డే రోజు అప్‌డేట్ ఇస్తానని అని చెప్పింది. గత కొద్ది రోజులుగా ‘ఓసీఎఫ్‌ఎస్’ అనే హ్యాష్ ట్యాగ్‌ని ట్రెండింగ్‌లో వుంచి షాకిచ్చిన నిహారిక.. నాగబాబు పుట్టిన రోజును పురస్కరించుకొని తన కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను అభిమానులతో పంచుకుంది.
ఓసీఎఫ్ఎస్ అంటే ‘‘ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’’ అని అర్థం అనే విషయాన్ని నిహారిక రివీల్ చేశారు. నిహారిక ‘ఓసీఎఫ్ఎస్’ అనే వెబ్ సిరీస్‌కు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మహేశ్ ఉప్పల దర్శకత్వంలో వస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో సంతోష్ శోభన్, సిమ్రాన్ శర్మ హీరో హీరోయిన్లు కాగా, సీనియర్ నటులు నరేశ్, తులసి కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో 40 నిమిషాల నిడివితో మొత్తం 5 ఎపిసోడ్లు ఉంటాయి. జీ5 ఓటీటీ వేదిక నుంచి ప్రసారం కానున్న ఈ వెబ్ సిరీస్ తొలి ఎపిసోడ్ ప్రీమియర్స్ నవంబరు 19న ఉండనుంది. ‘‘ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’’ టీజర్‌ను హీరో నాని ఈరోజు ఉదయం 11 గంటలకు ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేయనున్నారు. నిన్న విడుదల చేసిన అఫీషియల్ టీజర్‌ను బట్టి చూస్తే .. మహేశ్ అనే మధ్య తరగతి యువకుడు, అతని కుటుంబం చుట్టూ తిరిగే సహజమైన కథ ఇది. అమ్మా, నాన్న, బామ్మలతో యువకుడు పడే ఇబ్బందులను చాలా అందంగా చూపించారు. చివరిలో వాళ్ల నాన్న ఏదో గిఫ్ట్ ఇచ్చాడని.. 15 ఏళ్లు అని మహేశ్ చెబుతూ వుంటాడు. మరి అదేంటో తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com