వకీల్‌సాబ్ అప్పుడే రియాక్ట్ అవ్వాల్సింది, టాలీవుడ్‌లో యూనిటీ లేదు: మరోసారి నాని హాట్ కామెంట్స్

  • IndiaGlitz, [Sunday,December 26 2021]

ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై టాలీవుడ్ ప్రముఖులు- ఏపీ మంత్రుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. శ్యామ్ సింగ రాయ్ సినిమాకు ఒక్కరోజు ముందు ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల పై హీరో నాని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. థియేటర్లో కలెక్షన్స్ కంటే.. కిరాణా షాప్ లో మంచి కలెక్షన్స్ వస్తున్నాయంటూ నాని హాట్ కామెంట్స్ చేశారు. ఈ విషయంలో చాలా మంది నానిని సపోర్ట్ చేయగా.. ఏపీ మంత్రులు మాత్రం విమర్శించారు. తాజాగా మరోసారి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు . ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ టాలీవుడ్‌కి కష్టాలు మొదలయ్యింది.. వకీల్ సాబ్ సినిమా నుంచే అని అప్పుడే కనుక పరిశ్రమ నుంచి అందరూ రియాక్ట్ అయ్యి ఉంటే ఈపాటికే సమస్య పరిష్కారమయ్యేదని నాని అభిప్రాయపడ్డారు.

చిత్ర పరిశ్రమలో సమస్యలు వున్నాయనేది నిజమని.. అది వచ్చినప్పుడు అందరూ ఒకటికావాల్సిన అవసరం ఉందన్నారు. కానీ దురదృష్టవశాత్తూ టాలీవుడ్ లో అలాంటి పరిస్థితి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టాలీవుడ్ లో మాత్రం యూనిటీ లేదని .. తాను ఎవరినీ అవమానించడానికి ఈ మాటలు అనడం లేదని నాని అన్నారు. టాలీవుడ్ జనాలకు ఐక్యత లేదంటూ నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి దీనిపై మన స్టార్స్ ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.

ఇక నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కించిన సినిమా శ్యామ్ సింగరాయ్. పునర్జన్మల కాన్సెప్టుతో వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. నాని సరసన సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతిశెట్టి నటించారు. శనివారం రెండో రోజు ఏపీ, తెలంగాణలోనే 4 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన శ్యామ్ సింగరాయ్.. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 13 కోట్లు షేర్ వసూలు చేసింది. మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం వరుస సెలవులు వుండటంతో సింగరాయ్ దుమ్ము లేపే అవకాశం వుంది.

More News

Super singer Pragathi shares steaming hot one-piece photos - Dont miss

She recently took to her social media handle to share a glamorous photo from the Hot springs, Costa Rica. She wore a black one-piece and posed in front of the hot spring. In one of the photos, she was seen drenched in the waterfall while keeping her Instagram game up.

AR Rahman jams with African singer - Viral video

AR Rahman is a famous film composer, record producer, singer and songwriter who works predominantly in Tamil and Hindi films. The Padma Bhushan awardee has a habit of treating his fans with unexpected music on his social media platforms.

Director Cibi gives a massive update on Sivakarthikeyan's Don

Director Cibi who is helming the film shared an image from the dubbing studio announcing that SJ Suryah has finished his dubbing and that it was a pleasure to work with him. He wrote, "#DON Dubbing Done for @iam_SJSuryah sir It was a pleasure working with you sir."

Sai Pallavi's bold statement on doing a Bollywood film

In a recent interview, she opened up about doing Hindi films in the future. When prodded on the same, Sai stated, “Together also we would love to (do a Hindi film), and even if it's individually, I think the script matters.” Nani also added, “If it feels right to do that film, then yes. Not just to give one Bollywood entry or something. It just has to feel right.”

Superstar Rajinikanth makes a surprise call to Vignesh Shivan - Know why

Thalaivar Rajinikanth has always appreciated art and supported young talents. Recently he made a surprise call to Director Vignesh Shivan and Nayanthara to appreciate the duo for presenting the newly released film Rocky under their home production.