Nani:రాజకీయ నాయకుడిగా మారిన హీరో నాని.. ఎందుకంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో ఎక్కడ చూసినా ఎన్నికల వాతావరణమే కనపడుతోంది. ఏ గల్లీ చూసినా పార్టీల ప్రచారాలతో హోరెత్తుతోంది. గెలుపే లక్ష్యంగా నాయకుల ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరోలు కూడా తమ సినిమాలను వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. మూవీలను కొత్తగా ప్రమోట్ చేయడంలో హీరో నాని ఎప్పుడూ ముందుంటాడు. తాజాగా ఆయన నటించిన హాయ్ నాన్న సినిమా ప్రమోషన్స్ షూరూ చేశాడు. అయితే ప్రస్తుతం ఎలక్షన్ సీజన్ కావడంతో రాజకీయ నాయకుడి గెటప్‌లో ప్రచారం మొదలెట్టాడు.
‘‘ఇది ఎన్నికల సీజన్. ఇందులో మనం ఎందుకు జాయిన్ కాకూడదు.. డిసెంబర్ 7న మీ ప్రేమను మాకు ఇవ్వాలి. మీ ఓటు మాకే వేయాలి. ఇట్లు.. మీ ‘హాయ్ నాన్న’ పార్టీ ప్రెసిడెంట్ విరాజ్’’ అని పొలిటికల్ లీడర్ గెటప్‌లో ఫొటో షేర్ చేశారు. దీంతో ఈ ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటూ వైరల్ అవుతోంది. మీరు త్వరలోనే రాజకీయాల్లోకి రావాలని కొందరు.. ఈ గెటప్‌లో చాలా బాగున్నారని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి తన వినూత్న ప్రచారంతో సినిమాపై జనాల్లో అంచనాలు పెంచేలా చేశాడు ఈ నేచురల్ స్టార్.
గత చిత్రం ‘దసరా’తో బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్న నాని అదే ఊపులో ‘హాయ్ నాన్న' చిత్రంలో నటించారు. ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఇది రూపొందింది. తండ్రీ-కుమార్తెల సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి శౌర్యువ్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహిరంచారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇందులో నాని సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తుండగా.. శ్రుతి హాసన్ కీలకపాత్ర పోషిసున్నారు. ఈ సినిమా తన కెరీర్లోనే ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోతుందని నాని తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments