Nani:రాజకీయ నాయకుడిగా మారిన హీరో నాని.. ఎందుకంటే..?

  • IndiaGlitz, [Saturday,November 18 2023]

తెలంగాణలో ఎక్కడ చూసినా ఎన్నికల వాతావరణమే కనపడుతోంది. ఏ గల్లీ చూసినా పార్టీల ప్రచారాలతో హోరెత్తుతోంది. గెలుపే లక్ష్యంగా నాయకుల ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరోలు కూడా తమ సినిమాలను వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. మూవీలను కొత్తగా ప్రమోట్ చేయడంలో హీరో నాని ఎప్పుడూ ముందుంటాడు. తాజాగా ఆయన నటించిన హాయ్ నాన్న సినిమా ప్రమోషన్స్ షూరూ చేశాడు. అయితే ప్రస్తుతం ఎలక్షన్ సీజన్ కావడంతో రాజకీయ నాయకుడి గెటప్‌లో ప్రచారం మొదలెట్టాడు.

‘‘ఇది ఎన్నికల సీజన్‌. ఇందులో మనం ఎందుకు జాయిన్ కాకూడదు.. డిసెంబర్‌ 7న మీ ప్రేమను మాకు ఇవ్వాలి. మీ ఓటు మాకే వేయాలి. ఇట్లు.. మీ ‘హాయ్‌ నాన్న’ పార్టీ ప్రెసిడెంట్‌ విరాజ్‌’’ అని పొలిటికల్‌ లీడర్ గెటప్‌లో ఫొటో షేర్ చేశారు. దీంతో ఈ ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటూ వైరల్ అవుతోంది. మీరు త్వరలోనే రాజకీయాల్లోకి రావాలని కొందరు.. ఈ గెటప్‌లో చాలా బాగున్నారని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి తన వినూత్న ప్రచారంతో సినిమాపై జనాల్లో అంచనాలు పెంచేలా చేశాడు ఈ నేచురల్ స్టార్.

గత చిత్రం ‘దసరా’తో బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్న నాని అదే ఊపులో ‘హాయ్ నాన్న' చిత్రంలో నటించారు. ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఇది రూపొందింది. తండ్రీ-కుమార్తెల సెంటిమెంట్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి శౌర్యువ్‌ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహిరంచారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇందులో నాని సరసన మృణాల్ ఠాకూర్‌ నటిస్తుండగా.. శ్రుతి హాసన్ కీలకపాత్ర పోషిసున్నారు. ఈ సినిమా తన కెరీర్‌లోనే ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోతుందని నాని తెలిపారు.

More News

Vijayashanthi:కాంగ్రెస్‌లో అలా చేరారో లేదో.. విజయశాంతికి కీలక బాధ్యతలు..

మాజీ ఎంపీ విజయశాంతి నిన్న(శుక్రవారం) కాంగ్రెస్ పార్టీలో అలా చేరారో లేదో ఇవాళ ఆమెకు కీలక పదవి అప్పగించారు.

Purandeswari:ఏపీలో జనసేన-బీజేపీ కలిపి పోటీ చేస్తాయి: పురదేంశ్వరి

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని తెలిపారు.

Vijayashanthi:కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి.. కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు..

బీజేపీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ జాతీయాధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆమె హస్తం కండువా కప్పుకున్నారు.

Tiger Nageswara Rao:ఓటీటీలోకి వచ్చేసిన 'టైగర్ నాగేశ్వరరావు.. ఎందులో స్ట్రీమింగ్ అంటే..?

మాస్‌ మహారాజ రవితేజ తొలిసారి పాన్ ఇండియా హీరోగా నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' డివైడ్ టాక్ తెచ్చుకుని ఓ మోస్తరు విజయంతో సరిపెట్టుకుంది.

Bigg Boss Telugu 7 : ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం రచ్చ.. ప్రశాంత్‌ , శోభాశెట్టిపై శివాజీ చిందులు.. ఆ టాస్క‌లో విజేత ఎవరు..?

బిగ్‌బాస్ తెలుగులో ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం పోరు నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ ఇచ్చే ట్విస్టులకు కంటెస్టెంట్స్‌తో