Nagarjuna : లీడర్‌గా నటిస్తా కానీ.. లీడర్ మాత్రం కాను, పొలిటికల్ ఎంట్రీపై తేల్చేసిన నాగార్జున
Send us your feedback to audioarticles@vaarta.com
వైసీపీ అభ్యర్ధిగా, విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి తాను బరిలోకి దిగుతున్నట్లుగా వస్తున్న వార్తలను ఖండించారు టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నాగార్జున. ఆయన హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ఘోస్ట్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా తన రాజకీయ రంగ ప్రవేశంపై హల్‌చల్ చేస్తున్న వార్తలకు ఆయన చెక్ పెట్టారు. రాజకీయాలకు తాను దూరంగా వున్నానని.. ఏ పార్టీతో సంబంధం లేదని, ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడం లేదని నాగార్జున తేల్చిచెప్పారు. అయితే మంచి స్క్రిప్ట్ వుంటే పొలిటికల్ లీడర్‌గా మాత్రం నటిస్తానని నాగ్ పేర్కొన్నారు. గడిచిన పదిహేనుళ్లుగా ఎన్నికలు ఎప్పుడొచ్చినా తన పొలిటికల్ ఎంట్రీపై ప్రచారం జరుగుతోందని నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్‌కు కొరకరాని కొయ్యగా బెజవాడ:
తనకు కొరకరాని కొయ్యగా వున్న విజయవాడ లోక్‌సభ స్థానంలో ఎలాగైనా ఈసారి వైసీపీ జెండా ఎగురవేయ్యాలని సీఎం జగన్ భావిస్తున్నారు. 2019లో జగన్ ప్రభంజనంలోనూ ఇక్కడ టీడీపీ అభ్యర్ధి కేశినేని నాని విజయం సాధించారు. 2014లో రాష్ట్ర విభజన సమయంలోనూ ఇక్కడ గెలవాలని జగన్ తీవ్రంగా ప్రయత్నించారు. తన సన్నిహితులు పొట్లూరి వరప్రసాద్, కోనేరు రాజేంద్ర ప్రసాద్‌లను జగన్ బెజవాడ నుంచి బరిలో దించారు. కానీ రెండుసార్లూ నాని చేతిలో ఓడిపోవాల్సి వుంది. మూడోసారి కూడా కేశినేనియే ఇక్కడి నుంచి బరిలో దిగుతారని, లేనిపక్షంలో ఆయన సోదరుడు కేశినేని చిన్నికి టికెట్ దక్కే అవకాశం వుందని వార్తలు వస్తున్నాయి.
కమ్మ సామాజిక వర్గం, లోకల్, సినీ గ్లామర్... అందుకే నాగార్జున:
విజయవాడ లోక్‌సభ పరిధిలో తెలుగుదేశం పార్టీ బలంగా వుంది. అన్నింటికీ మించి కమ్మ సామాజిక వర్గం ప్రాబల్యం ఇక్కడ అధికం. బెజవాడ నుంచి ఎవరు గెలిచినా అది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే. దీనిని దృష్టిలో వుంచుకుని నాగార్జునను జగన్ ఎంపిక చేశారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. సినీ గ్లామర్, కమ్మ సామాజిక వర్గం, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పైగా కృష్ణా జిల్లాకే చెందిన వ్యక్తి కావడంతో నాగార్జునని బరిలోకి దింపాలని జగన్ డిసైడ్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాను రాజకీయాలకు దూరంగా వున్నట్లు అక్కినేని నాగార్జున స్వయంగా ప్రకటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout