Hero Madhavan:హీరో మాధవన్‌కు పుత్రోత్సాహం.. స్విమ్మింగ్‌లో సత్తా చాటిన కొడుకు, వేదాంత్‌కు పతకాల పంట
- IndiaGlitz, [Monday,February 13 2023]
హీరో కొడుకు .. హీరో అవుతాడనేది పాత సామెత. కానీ ఈ తరం మాత్రం అందుకు భిన్నంగా వుంటోంది. స్టార్ హీరోలు తమ కుమారులను హీరోలుగా చేయకుండా తమ పిల్లలకు ఏ రంగం నచ్చితే అందులో ప్రోత్సహిస్తున్నారు. ఈ విషయంలో కోలీవుడ్ సీనియర్ నటుడు మాధవన్ ముందువరుసలో వుంటారు. దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ అందాల నటుడిగా, రోమాంటిక్ హీరోగా మాధవన్‌కు గుర్తింపు వుంది. ఆయన తనయుడు వేదాంత్ మాధవన్ తండ్రిలాగే అందగాడు. ఇతను కూడా హీరోగా అడుగుపెడతాడని అంతా అనుకున్నారు. కానీ రోటీన్‌కు భిన్నంగా వెళ్లారు మాధవన్.
స్విమ్మింగ్ వైపు కొడుకుని ప్రోత్సహించిన మాధవన్:
వేదాంత్‌కు స్విమ్మింగ్ అంటే ఇష్టం కావడంతో అటు వైపుగా ప్రోత్సహించాడు. ప్రొఫెషనల్ స్విమ్మర్‌గా మారిన వేదాంత్ పలు టోర్నీల్లో సత్తా చాటుతున్నాడు. తాజాగా ‘‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023’’లో వేదాంత్ ఏకంగా ఏడు పతకాలు సాధించాడు. ఇందులో 5 గోల్డ్ మెడల్స్, 2 సిల్వర్ మెడల్స్ వున్నాయి. వంద మీటర్లు, 200 మీటర్లు, 1500 మీటర్ల విభాగాల్లో స్వర్ణాలు సాధించిన వేదాంత్.. 400 మీటర్లు, 800 మీటర్ల విభాగంలో రజత పతకాలు సాధించాడని మాధవన్ చెప్పారు.
సోషల్ మీడియాలో వేదాంత్ ఫోటోలు వైరల్:
దీనికి సంబంధించిన ఫోటోలను మాధవన్ ట్విట్టర్‌లో పంచుకున్నాడు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో పంచుకున్నాయి. దీనిపై వేదాంత్ మీడియాతో మాట్లాడుతూ.. తన విజయాల వెనుక తన తండ్రి మాధవన్ వున్నాడని చెప్పాడు. ఒలింపిక్స్‌లో భారతదేశం తరపున స్వర్ణ పతకం సాధించడమే తన లక్ష్యమని చెప్పాడు. ఈ సందర్భంగా మాధవన్, వేదాంత్‌లపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇకపోతే.. ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో 161 పతకాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన మహారాష్ట్రకు మాధవన్ అభినందనలు తెలిపారు. మహారాష్ట్రకు 56 స్వర్ణాలు, 55 రజతాలు, 50 కాంస్య పతకాలు సాధించింది.
With gods grace -Gold in 100m, 200m and 1500m and silver in 400m and 800m . 🙏🙏🙏👍👍 pic.twitter.com/DRAFqgZo9O
— Ranganathan Madhavan (@ActorMadhavan) February 12, 2023