హీరో 'మానస్' జన్మదినోత్సవ వేడుకలు
Send us your feedback to audioarticles@vaarta.com
"జలక్ ", "గ్రీన్ సిగ్నల్ ", "కాయ్ రాజా కాయ్ " చిత్రాల కథానాయకుడు , ప్రస్తుతం నిర్మాణం లో ఉన్న "గోళీసోడా " హీరో 'మానస్ నాగులాపల్లి' జన్మదినోత్సవ వేడుకలు బి . యన్ . రెడ్డి నగర్ లో ని ఆప్టేక్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంస్థ ఆవరణ లో విద్యార్థుల సమక్షం లో జరుపుకున్నారు . తొలి కేక్ కట్ చేసి, మాతృ మూర్తి , ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్ సెక్టార్ వైస్ చైర్మన్ , నిర్మాత పద్మిని నాగులాపల్లి కి తినిపించగా , హీరో మానస్ మాట్లాడుతూ సినీ పరిశ్రమ పై ఉన్నత ఆసక్తి తో నటుడు కావాలని రావటం జరిగింది , కష్టపడి మంచి నటుడు గ గుర్తింపు పొందాలని అనుకున్నట్టు చెప్పారు .
పద్మిని నాగులాపల్లి తన కుమారుడి నటన పై ఉన్న ఆసక్తి తో ప్రోత్సహించినట్టు విద్యార్థుల సమక్షం లో జరుపుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆప్టెక్ సంస్థ సి.ఈఓ. మహమ్మద్ ఖాదర్ ఘోరీ యువ హీరో 'మానస్' ఎంత కష్ట పడి సినీ పరిశ్రమ లో స్థిరపడాలి అని , తాను నటిస్తున్న చిత్రాలను జాగ్రత్తగా ఎన్నుకోవటం హర్షనీయం. మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో సెంటర్ హెడ్ జయ శ్రీ , డైరెక్టర్ వికాస్ రెడ్డి , సినీ టీవీ ఆర్టిస్ట్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com