‘సుందరాంగుడు’ చిత్రం విడుదలకు సహకరించండి - హీరో కృష్ణసాయి

  • IndiaGlitz, [Thursday,January 27 2022]

ఏ.వి.సుబ్బారావు సమర్పణలో ఎమ్‌.ఎస్‌.కె. ప్రమీద శ్రీ ఫిలిమ్స్‌ పతాకంపై కృష్ణసాయి, మౌర్యాని, ఈషా, రీతూ, సాక్షి శర్మ నటీనటులుగా వినయ్‌బాబు దర్శకత్వంలో చందర్‌గౌడ్‌, యం.యస్‌.కె. రాజులు సంయుక్తంగా నిర్మిస్తున్న లవ్‌ అండ్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ ‘సుందరాంగుడు’. వినూత్న ప్రేమకథ తో రూపొందిన ఈ సినిమా సెన్సార్‌ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధమవుతోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26 న హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ ఛాంబర్‌లో, సీనియర్‌ ఫోటో జర్నలిస్ట్‌ సాయి రమేష్‌ చేతుల మీదుగా ‘సుందరాంగుడు’ ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమం ఘనంగా జరుపుకుంది.

కృష్ణసాయి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కృష్ణసాయి ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. తమ చారిటబుల్‌ ట్రస్ట్‌కు ఆర్థిక సపోర్ట్‌ కోసం ఈ సినిమా నిర్మాణాన్ని ప్రారంభించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదల విషయంలో ఆర్థిక ఇబ్బందు ఎదుర్కొంటోంది. పదిమందికి సహాయం చేయాలనే మంచి సంకల్పంతో ప్రారంభించిన ఈ సినిమా విడుదల విషయంలో పెద్దలు మంచి మనసు చేసుకుని విడుదలకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు కృష్ణసాయి. ఈ సినిమా ద్వారా వచ్చే ప్రతి రూపాయి పేదల జీవితాలు బాగు చేయటానికి, వారికి సాయం చేయటానికి ఉపయోగిస్తామని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో హీరో కృష్ణసాయి మాట్లాడుతూ... ఈ కోవిడ్‌ కారణంగా మీడియా సమక్షంలో మా చిత్ర ట్రైలర్‌ విడుదల చేయడం జరిగింది. ఈ బ్యానర్‌లో నేను, చంద్రగౌడ్‌ గారు రెండు సంవత్సరాలు కష్టపడి సినిమాను పూర్తి చేశాం. 7 పాటలు ఉన్నాయి. అందులో ఒక డీజే సాంగ్‌ ఉంది. అద్భుతమైన లొకేషన్స్‌లో చిత్రీకరించిన పాటలు ‘సుందరాంగుడు’ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఫుల్‌లెంగ్త్‌ కామెడీ ఎంటర్‌ టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమా విడుదలకు మీరందరూ సపోర్ట్‌ చేయాలని కోరుతున్నాను. మాకున్న కృష్ణ సాయి చారిటబుల్‌ ట్రస్టు తరఫున చాలామందికి హెల్ప్‌ చేస్తున్నాము. అలాగే ఈ సినిమా ద్వారా వచ్చిన లాభాలను కూడా మా ట్రస్ట్‌ ద్వారా హెల్ప్‌ చేయడం జరుగుతుంది.

ఈ మధ్య సింగర్‌ జై శ్రీనివాస్‌ చనిపోవడం దురదృష్టకర సంఘటన. వాళ్ల ఫ్యామిలీని కలిసి మాకు తోచిన సహాయం చేశాం. మా సినిమా సెన్సార్‌ పూర్తి అయి నాలుగు నెలలైంది. థియేటర్స్‌ దొరికినా వాటి రెంట్‌, క్యూబ్స్‌కు డబ్బు కట్టటానికి ఇబ్బంది అవుతోంది. మాకు సపోర్ట్‌ లేక సినిమా రిలీజ్‌ చేసుకోలేకపోతున్నాను. ఇలా ఎంతో మంది నిర్మాతలు సినిమా రిలీజ్‌ విడుదల చేసుకో లేక ఇబ్బంది పడుతున్నారు. దయచేసి చిన్న సినిమాల విడుదలకు పరిశ్రమ పెద్దలు సపోర్ట్‌ చేయాలని కోరుతున్నాను.

నటీనటులు: కృష్ణసాయి, మౌర్యాని, ఈషా, రీతూ, సాక్షి శర్మ ,జీవా, భాషా, అమిత్‌ తివారి, జూనియర్‌ రేలంగి, మిర్చి మాధవి తదితరులు.

More News

‘‘ఫుల్ కిక్కు’’ అంటోన్న ఖిలాడీ.. రవితేజ ఫ్యాన్స్‌కి మాస్ ట్రీట్

మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్‌గా నటిస్తోన్న సినిమా 'ఖిలాడి'.

‘‘విరాట్’’ సేవలకు ఇక విశ్రాంతి.. రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోడీ వీడ్కోలు

73వ గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని మోదీ ‘విరాట్‌’కు వీడ్కోలు పలికారు.

ఉదయం చిరంజీవి.. ఇప్పుడు శ్రీకాంత్‌, తెలుగు ఇండస్ట్రీపై కోవిడ్ పడగ

తెలుగు చిత్ర పరిశ్రమపై కోవిడ్ పగబట్టినట్లుగా  వుంది. ఇప్పటికే మహేశ్ బాబు, మంచు లక్ష్మీ, మంచు విష్ణు,

టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులను నియమించిన కేసీఆర్.. ఏ జిల్లాకు ఎవరంటే..?

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ జిల్లాలకు అధ్యక్షులను నియమించారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు ఏకకాలంలో పార్టీ అధ్యక్షులను నియమిస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేశారు.

15 ఏళ్ల నాటి ‘‘ముద్దు’’ కేసు.. శిల్పా శెట్టికి కోర్టులో ఊరట

బ‌హిరంగ ముద్దు కేసు నుంచి బాలీవుడ్ సీనియర్ న‌టి శిల్పా శెట్టికి కోర్టులో భారీ ఊర‌ట ల‌భించింది.