రైతులకు అండగా కార్తీ.. వినూత్న కార్యక్రమానికి శ్రీకారం..
Send us your feedback to audioarticles@vaarta.com
రైతుల ఆదుకునేందుకు హీరో కార్తీ నడుం బిగించారు. ఇది ఒక్క ఏడాదితో పోయేలా కాకుండా నిరంతరం కొనసాగేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు కార్తీ ఒక ఫౌండేషన్‌ను కూడా ప్రారంభించారు. దీని కోసం హీరో, కార్తీ సోదరుడు సూర్య.. కోటి రూపాయలు విరాళం ఇచ్చి ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు. జీ టీవీ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు కార్తీ తెలిపారు. ఈ మేరకు కార్తీ ఒక ప్రకటనను విడుదల చేశారు.
‘‘మీ కుటుంబంలో అందరి శ్రేయస్సు, ఆనందాన్ని కోరుకుంటున్నాను. నా చిత్రం ‘కడైకుట్టి సింగం’ తరువాత.. వ్యవసాయం, రైతులకు ఏదైనా చేయాలని భావించాము. ఈ క్రమంలోనే ఉజావన్ ఫౌండేషన్‌ను ప్రారంభించాం. దీని కోసం సూర్య తొలి స్టెప్ తీసుకుని కోటి రూపాయల విరాళం ఇచ్చారు. ఈ సంవత్సరం మా ఫౌండేషన్ తరుఫున ఉజావన్ అవార్డులను కూడా పరిచయం చేస్తున్నాం. జీటీవీ సహకారంతో వ్యవసాయం, రైతులను గౌరవించేందుకు మేము డెల్టా ప్రాంతం నుంచి ఐదుగురు రైతులను ఎంచుకున్నాం. మేము ఎంచుకున్న రైతులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున ఇచ్చి గౌరవిస్తాం. ఈ కార్యక్రమాన్ని టీవీలో చూసిన ఎందరో ప్రశంసించారు. మేము ప్రారంభిస్తున్న ఈ చిన్న కార్యక్రమాన్ని మీ ఆశీర్వాదంతో భారీగా ఎదగనివ్వండి’’ అని కార్తీ పేర్కొన్నారు.
ఆది నుంచి కోలీవుడ్ ఇండస్ట్రీ రైతులకు అండగా నిలుస్తూనే వస్తోంది. గతంలో హీరో విశాల్ కూడా డిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్న తమిళనాడు రైతులకు మద్దతుగా నిలిచాడు. రైతుల నిరసనలను ఎవరూ పట్టించుకోకపోవడంతో విశాల్ స్వయంగా రంగంలోకి దిగి.. పలువురు మంత్రులు, ఢిల్లీ పెద్దలను కలిసి రైతుల సమస్యలు, ఆత్మహత్యల గురించి వివరించారు. కానీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల నిర్ణయం వెలువడకపోవడంతో నడిగర్ సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే.. ప్రతి సినిమా టిక్కెట్‌పై ఒక రూపాయి రైతులకు అందించేందుకు తాము సిద్ధమని ప్రకటించాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout