close
Choose your channels

పవర్ స్టార్ ను అవమానించిన హీరో....

Friday, March 18, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలుగు ప్రేక్షకులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జయాపజయాలతో సంబంధం లేని స్టార్ డమ్ పవన్ సొంతం. పవన్ సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లోనే కాదు, ఇండస్ట్రీ వర్గాల్లోనే ఆసక్తి నెలకొని ఉంటుంది. ఇప్పుడు పవన్ ఫీవర్ టాలీవుడ్ లో హల్ చల్ చేస్తుంది. అందుకు కారణం సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ కావడమే. ఏప్రిల్ 8న సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేస్తుండటం విశేషం.

ఈ సినిమా టీజర్ ను హిందీలో కూడా విడుదల చేశారు. నార్త్ లో 800 థియేటర్స్ లో విడుదలవుతున్న ఈ చిత్రంపై, పవన్ పై కమాల్ ఆర్. ఖాన్ వ్యంగంగా ట్విట్టర్ లో కామెంట్స్ చేశాడు. పవన్ కళ్యాణ్ వంటి జోకర్ నటించిన సినిమాలు చూడటం కంటే రాజ్ పాల్ యాదవ్ నటించిన సినిమాలు చూడటానికి ఇష్టపడతాను. పవన్ కళ్యాణ్ వంటివాడు హీరో అయితే లోకంలో ఎవరైనా సూపర్ స్టార్ కావచ్చు అంటూ కామెంట్స్ చేశాడు. మరి గతంలో రజనీకాంత్, ప్రభాస్ బాహుబలి, మహేష్ బాబు, విజయ్ వంటి హీరోలను కామెంట్ చేసిన సదరు బాలీవుడ్ స్టార్ కామెంట్స్ కు పవన్ ఫ్యాన్స్ ఏమని బదులిస్తారో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment