పవర్ స్టార్ ను అవమానించిన హీరో....

  • IndiaGlitz, [Friday,March 18 2016]

తెలుగు ప్రేక్షకులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జయాపజయాలతో సంబంధం లేని స్టార్ డమ్ పవన్ సొంతం. పవన్ సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లోనే కాదు, ఇండస్ట్రీ వర్గాల్లోనే ఆసక్తి నెలకొని ఉంటుంది. ఇప్పుడు పవన్ ఫీవర్ టాలీవుడ్ లో హల్ చల్ చేస్తుంది. అందుకు కారణం సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ కావడమే. ఏప్రిల్ 8న సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేస్తుండటం విశేషం.

ఈ సినిమా టీజర్ ను హిందీలో కూడా విడుదల చేశారు. నార్త్ లో 800 థియేటర్స్ లో విడుదలవుతున్న ఈ చిత్రంపై, పవన్ పై కమాల్ ఆర్. ఖాన్ వ్యంగంగా ట్విట్టర్ లో కామెంట్స్ చేశాడు. పవన్ కళ్యాణ్ వంటి జోకర్ నటించిన సినిమాలు చూడటం కంటే రాజ్ పాల్ యాదవ్ నటించిన సినిమాలు చూడటానికి ఇష్టపడతాను. పవన్ కళ్యాణ్ వంటివాడు హీరో అయితే లోకంలో ఎవరైనా సూపర్ స్టార్ కావచ్చు అంటూ కామెంట్స్ చేశాడు. మరి గతంలో రజనీకాంత్, ప్రభాస్ బాహుబలి, మహేష్ బాబు, విజయ్ వంటి హీరోలను కామెంట్ చేసిన సదరు బాలీవుడ్ స్టార్ కామెంట్స్ కు పవన్ ఫ్యాన్స్ ఏమని బదులిస్తారో చూడాలి.

More News

'నాయకి' టీజర్ విడుదల

త్రిష ప్రధాన పాత్రధారిగా రాజ్ కందుకూరి సమర్పణలో గిరిధర్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పై గోవి దర్శత్వంలో మామిడిపల్లి గిరిధర్,పద్మజ మామిడిపల్లి సంయుక్తంగి నిర్మిస్తున్న చిత్రం నాయకి.

సక్సెస్ కోసం సందీప్ టూర్..

సందీప్ కిషన్,అనీషా అంబ్రోస్ జంటగా మిస్టర్ నూకయ్య ఫేం అని కన్నెగంటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం రన్.

ప్రజెంట్ లవ్ + ప్యూర్ లవ్=రొమాన్స్ విత్ ఫైనాన్స్ రేపే రిలీజ్

సతీష్ బాబు,మెరినా అబ్రహం జంటగా రాజు కుంపట్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం రొమాన్స్ విత్ ఫైనాన్స్.ఈ చిత్రాన్నిరిషి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై జనార్ధన్ మందముల నిర్మించారు.

జీవితాన్ని మార్చే సినిమా ఊపిరి - అక్కినేని నాగార్జున

నాగార్జున - కార్తీ -తమన్నా కాంబినేషన్లో రూపొందిన ఊపిరి చిత్రాన్ని వంశీ పైడిపల్లి తెరకెక్కించారు. తెలుగు, తమిళ్ లో పి.వి.పి సంస్థ ఈ చిత్రాన్నినిర్మించింది. ప్రపంచ వ్యాప్తంగా ఊపిరి చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా టాలీవుడ్ కింగ్ నాగార్జున తో ఇంటర్ వ్యూ మీకోసం...

'ప్రేమమ్' రిలీజ్ డేట్ మారింది....

అక్కినేని నాగచైతన్య హీరోగా కార్తికేయ ఫేమ్ చందు మొండేటి దర్శకత్వంలో మలయాళ చిత్రం ప్రేమమ్ ను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు.