హీరో ఫిక్సయ్యాడా..?
- IndiaGlitz, [Saturday,July 15 2017]
బాహుబలి చిత్రంతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటాడు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. బాహుబలి రెండు పార్టులు కలిపి దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కలెక్ట్ చేయడం విశేషం. ఇప్పుడు అందరూ తెలుగు సినిమా రంగం వైపు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో వైపు బాహుబలి వంటి విజువల్ వండర్ తర్వాత రాజమౌళి ఎలాంటి సినిమా చేస్తాడోనని బాలీవుడ్ సహా అన్ని పరిశ్రమలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
రాజమౌళి ఎన్టీఆర్‌తో చేస్తాడని ఈ మధ్య వార్తలు వినపడ్డాయి కూడా. కాగా తాజాగా ఇప్పుడు రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని ముగ్గురు హీరోలతో చేస్తాడనే టాలీవుడ్ టాక్. ఈ సినిమాను ముఖ్యంగా తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో తెరకెక్కిస్తారట. ఒక్కొక్క భాష నుండి ఒక్కో హీరో నటించే అవకాశాలున్నాయంటున్నారు. తాజా సమాచారం ప్రకారం రాజమౌళి తదుపరి చిత్రంలో జాతీయ నటుడు మోహన్‌లాల్ నటిస్తున్నాడట. ఇప్పటికే మోహన్‌లాల్ మనమంతా, జనతాగ్యారేజ్ చిత్రాలతో ఇంకా సుపరిచితులైయ్యారు. దీంతో రాజమౌళి కన్ను మోహన్‌లాల్‌పై పడింది. ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తారట. త్వరలోనే రాజమౌళి సినిమాపై ఓ క్లారిటీ రానుంది.