నిర్మాతపై హీరో పోలీస్ కంప్లయింట్... ఎందుకంటే?
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో విశాల్, ప్రొడ్యూసర్ ఆర్.బి. చౌదరి మధ్య కొన్నాళ్లుగా ఆర్థిక లావాదేవీల విషయంలో సమస్యలు ఉన్నాయి. అవి ఓ కొలిక్కి రాకపోగా, ముదిరి పాకాన పడి గొడవగా మారింది. ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. ఆర్.బి. చౌదరిపై విశాల్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. స్టేషన్ లో కేసు పెట్టాడు. గొడవకు మూలం ఏమిటి అని పూర్వాపరాల్లోకి వెళితే...
ఇదీ చదవండి: ప్రభాస్, ప్రశాంత్ నీల్, దిల్ రాజు కాంబో.. మైండ్ బ్లోయింగ్ ప్లానింగ్!
విశాల్ హీరోగా యాక్ట్ చెయ్యడంతో పాటు ప్రొడ్యూస్ చేసిన డబ్బింగ్ సినిమా 'అభిమన్యుడు'. తమిళంలో 'ఇరుంబు తిరై' పేరుతో తీశారు. ఆ సినిమా కోసం ఆర్.బి. చౌదరి దగ్గర విశాల్ కొంత మొత్తం అప్పు చేశాడు. విశాల్ చెప్తున్న వెర్షన్ ప్రకారం... లోన్ తీసుకున్నప్పుడు ఆర్.బి. చౌదరికి గ్యారెంటీగా సంతకం చేసిన బాండ్లు, ప్రామిసరీ నోట్లు, చెక్స్ ఇచ్చాడు. సినిమా రిలీజైన తరువాత డబ్బులు తిరిగి ఇచ్చాడు. కాని ఆర్.బి. చౌదరి బాండ్లు గట్రా వెనక్కి ఇవ్వలేదు. కొన్ని నెలలు గడిచాక డాక్యుమెంట్లు మిస్ అయ్యాయని చెప్పారట. దాంతో కేసు పెట్టానని విశాల్ ట్వీట్ చేశాడు. ఇష్యూను ఎవరో ఒకరు సాల్వ్ చేసుకోవడానికి ముందుకు రావాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments