సూర్యకు డబ్బింగ్ చెబుతున్న హీరో
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళంతో పాటు తెలుగులోనూ మార్కెట్ ఉన్న హీరోల్లో సూర్య ఒకరు. అందుకనే ఆయన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతుంటాయి. అయితే ఈ మధ్య కాలంలో విడుదలైన సూర్య సినిమాలు ఎన్‌జీకే, బందోబస్త్(కాప్పాన్) చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేపోయాయి. అయితే ఈ ఏడాది సమ్మర్‌లో `ఆకాశం నీ హద్దురా` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్న సూర్య స్పీడుకు కరోనా వైరస్ బ్రేకేసింది. కాగా త్వరలోనే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేస్తున్నారు. కాగా తాజా సమాచారం మేరకు ఈసారి తెలుగులో సూర్య వాయిస్‌కు తెలుగులో ఓ హీరో డబ్బింగ్ చెప్పబోతున్నాడని టాక్. వినపడుతుంది. ఆ హీరో ఎవరో కాదు సత్యదేవ్. ఇప్పటి వరకు శ్రీనివాసమూర్తి డబ్బింగ్ చెప్పాడు. అయితే సూర్య ‘గ్యాంగ్’కు సూర్యనే డబ్బింగ్ చెప్పుకున్నాడు. కాగా..ఇప్పుడు సత్యదేవ్‌తో డబ్బింగ్ చెప్పుకోవాలని చూస్తున్నాడు.
త్వరలోనే ఆకాశం నీహద్దురా సినిమా విడుదల తేదీపై సూర్య అండ్ టీమ్ ఓ క్లారిటీని ఇవ్వనున్నారు. అలాగే సూర్య డైరెక్టర్ హరి దర్శకత్వంలో అరువా అనే సినిమాను చేయబోతున్నారు. అలాగే వెట్రిమారన్ దర్శకత్వంలోనూ సూర్య మరో సినిమా చేయబోతున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com