రైతుల కోసం హీరో ఏం చేశాడంటే....

  • IndiaGlitz, [Wednesday,July 25 2018]

హీరోల్లో సోష‌ల్ అవేర్‌నెస్ పెరుగుతుంది. వీలైనంత మంది తమ వంతుగా స‌మాజానికి స‌హ‌కారాన్ని అందిస్తున్నారు. హీరో సూర్య మ‌రోసారి త‌న పెద్ద మ‌న‌సుని మ‌రోసారి చాటుకున్నారు.

ఇప్ప‌టికే అగ‌రం ఫౌండేష‌న్ ద్వారా సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న హీరో సూర్య‌.. రీసెంట్‌గా రైతుల కోసం కోటి రూపాయల‌ను విరాళంగా ఇచ్చాడు. కార్తి హీరోగా సూర్య నిర్మించిన చిత్రం 'క‌డై కుట్టి సింగం'(చిన‌బాబు)... మంచి విజ‌యాన్ని సాధించింది. ఈ సంద‌ర్బంగా సూర్య రైతు సంక్షేమ సంఘానికి కోటి రూపాయనల‌ను విరాళంగా అందించారు.