Dhanush Son Yatra: అచ్చు గుద్దినట్లు హీరో ధనుష్‌ను దించేసిన పెద్ద కొడుకు 'యాత్ర'
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ స్టార్ హీరో ధనుష్.. తెలుగు, హిందీ ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితం. తెలుగులో '3', 'రఘువరన్ బీటెక్' వంటి డబ్బింగ్ సినిమాలతో పాటు స్ట్రెయిట్ తెలుగు మూవీ 'సార్'తోనూ అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక హిందీలోనూ కొన్ని సినిమాలు చేసి అక్కడా పాపులారిటీ దక్కించుకున్నాడు. తాజాగా సంక్రాంతి కానుకగా 'కెప్టెన్ మిల్లర్'తో తమిళ ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమా రిపబ్లిక్ డే కానుకగా తెలుగులోనూ విడుదలైంది.
ఇదిలా ఉంటే సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్యను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కొంతకాలం కిందట వీరిద్దరూ విడిపోయారు. వీరికి ఇద్దరు కుమారులు. ఒకరి పేరు 'యాత్ర', మరికొరి పేరు 'లింగ'. కానీ కుమారుల బాధ్యతలను ఇద్దరూ చూసుకుంటున్నారు. గతంలో ఓ ఫంక్షన్‌లో ధనుష్‌తో ఉన్న వీరిద్దరు ఉన్న ఫొటోలు అభిమానులను తెగ ఆకట్టుకున్నాయి.
తాజాగా ఐశ్వర్య దర్శకురాలిగా 'లాల్ సలాం' అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో రజినీకాంత్ ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు. ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చెన్నైలో శుక్రవారం రాత్రి గ్రాండ్‌గా ఆడియో రిలీజ్ ఈవెంట్ చేశారు. ఇందులో ధనుష్ ఇద్దరు కొడుకులు అమ్మ ఐశ్వర్యతో కలిసి హాజరయ్యారు. దీంతో వీరిద్దరు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పెద్ద కొడుకు 'యాత్ర' అచ్చు గుద్దినట్లు ధనుష్ లాగే ఉండటం విశేషం. దీంతో ధనుష్ వారసుడు త్వరలోనే సినిమాల్లోకి రావడం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమా విషయానికొస్తే భారత్‌లో ఎంతో ఆదరణ ఉన్న క్రికెట్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. అగ్ర హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించటంతో పాటు డిఫరెంట్ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను రూపొందిస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ 'లాల్ సలామ్’ చిత్రాన్ని నిర్మించింది. ఇక ఈ చిత్రంలో జీవితా రాజశేఖర్, క్రికెట్ లెంజెండ్ కపిల్ దేవ్ నటించడం విశేషం. ప్రముఖ సంగీత దర్శకడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments