ప్రేమ వ్యవహారంపై నోరు విప్పిన హీరో.. మతం కూడా మార్చుకున్నాడు
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో జై.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు కూడా తెలిసిన పేరే. గతంలో ఆయన నటించిన తమిళ చిత్రం `జర్నీ` పేరుతో విడుదలై పెద్ద సక్సెస్ అయ్యింది. అక్కడితో ఆగిపోలేదీ హీరో, తెలుగు హీరోయిన్ అంజలితో ప్రేమ వ్యవహారం నడిపాడు. ఇద్దరూ ప్రేమలో ఉండగానే బెలూన్ సినిమాలో నటించారు. వీరిద్దరూ ఘాటు ప్రేమాయణం నడిపారు. ఎంతలా అంటే.. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు అనేంతగా ప్రేమించుకున్న వీరిద్దరూ విడిపోయారు. ఈ ప్రేమ వ్యవహారంపై స్పందించిన ఈ హీరో తాను, అంజలి మంచి స్నేహితులమే. కానీ ప్రేమికులం కాదని చెప్పాడు.
తాను త్వరలోనే మరో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నానని, తన పెళ్లి త్వరలోనే ఏదో ఒకటి చెబుతానని హీరో జై తెలిపాడు. అంతే కాకుండా.. ఈ హీరో ఇస్లాం మతాన్ని స్వీకరించాడని వార్తలు వచ్చాయి. దీనిపై కూడా జై స్పందించాడు. ఏడేళ్లుగా ఇస్లాం మతాన్ని పాటిస్తున్నానని, దేవుడిని నమ్మని తాను ఏదో ఒక దేవుడిని నమ్మితే చాలునని భావించిన తన కుటుంబం ఈ వ్యవహారంపై అభ్యంతరం చెప్పలేదని హీరో చెప్పాడు. త్వరలోనే తన పేరుని అశిష్ జైగా మార్చుకుంటున్నానని తెలిపాడు హీరో జై.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments