సూపర్‌స్టార్‌కు విలన్‌గా హీరో తమ్ముడు
Send us your feedback to audioarticles@vaarta.com
రీసెంట్ హిట్‌తో ఆనందంగా ఉన్న హీరో తాజా చిత్రానికి విలన్ ఫిక్సయ్యారు. ఆ హీరో పేరు మోహన్‌లాల్. ఆయన ఇటీవల నటించిన సినిమాలన్నీ ఎంత పెద్ద పెద్ద విజయాలను సొంతం చేసుకున్నవో తెలిసిందే. మలయాళ సూపర్‌స్టార్ మోహనల్‌లాల్ హీరోగా సిద్ధిఖీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి `బిగ్ బ్రదర్` అనే పేరు పెట్టారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ తమ్ముడు అర్భాజ్‌ఖాన్ విలన్‌గా నటించనున్నారట.
ఈ విషయాన్ని అర్భాజ్ ట్వీట్ చేశారు. మోహన్‌లాల్, సిద్ధిఖీతో కలిసి తీసుకున్న ఫొటోను పోస్ట్ చేశారు. దాంతో పాటు ``లెజండరీ ఆర్టిస్ట్ మోహన్‌లాల్‌గారు, సిద్ధిఖీని కలవడం, వారితో పనిచేయడం ఎగ్జయిటింగ్‌గా ఉంది. మలయాళంలో నా తొలి సినిమా ఇది. ఆసక్తిగా ఎదురుచూస్తున్నా`` అని అందులో రాశారు. జులైలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఫస్ట్ షెడ్యూల్ నుంచే అర్భాజ్ షూటింగ్లో పాల్గొంటారని సమాచారం. అక్టోబర్‌లో ఈ సినిమా విడుదల కానుంది. .
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments